Tourism in Kashmir : కశ్మీర్‌కు పోటెత్తుతున్న పర్యాటకులు.. తెలుగువాళ్లే ఎక్కువ

జమ్మూకశ్మీర్ కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో కశ్మీర్ లో వరుసగా వలస కార్మికులు,స్థానికేతరులు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంతో కశ్మీర్ లో టెన్షన్ వాతావరణం

Tourism in Kashmir : కశ్మీర్‌కు పోటెత్తుతున్న పర్యాటకులు.. తెలుగువాళ్లే ఎక్కువ

Srinagar

Tourism in Kashmir :  జమ్మూకశ్మీర్ కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో కశ్మీర్ లో వరుసగా వలస కార్మికులు,స్థానికేతరులు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంతో కశ్మీర్ లో టెన్షన్ వాతావరణం నెలకొన్నప్పటికీ..వెంటనే పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు మన భద్రతాబలగాలు. దీంతో  కశ్మీర్ లోని ప్రకృతిని ఆస్వాదించేందుకు భారీగా పర్యటకులు తరలివెళ్తున్నారు. ఈ నవంబర్ లో రికార్డు స్థాయిలో 1.27లక్షల మంది కశ్మీర్ ను సందర్శించారు. గడిచిన ఏడేళ్లలో కశ్మీర్​ను ఒక నెలలో సందర్శించిన పర్యటకుల సంఖ్య ఇదే అత్యధికం.

2020 నవంబర్ లో 6,327మంది పర్యాటకులు కశ్మీర్ ని సందర్శించగా,2019 నవంబర్ లో 12,086, 2018 నవంబర్ లో 33,720,2017నవంబర్ లో 1.12లక్షలు,2016 నవంబర్ లో 23,569,2015 నవంబర్ లో 64,778 మంది పర్యాటకులు జమ్మూకశ్మీర్ ని సందర్శించారు. అయితే ఈ ఏడాది నవంబర్ లో ఏడేళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ అత్యధికంగా 1.27లక్షల మంది పర్యాటకులు జమ్మూకశ్మీర్ ని సందర్శించారు.

శీతాకాలంలో కశ్మీర్​ వ్యాలీని చూసేందుకు పర్యాటకులు మొగ్గుచూపుతారు . వీటిని దృష్టిలో ఉంచుకొని శీతాకాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు అధికారులు. పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు శీతాకాలంలో వింటర్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుంటారు. దూద్​పత్రి, సోన్ మార్గ్ వంటి ప్రాంతాలకు అంతర్జాతీయ టూరిస్టులను సైతం అనుమతించడం కూడా ప్రస్తుతం పర్యటకుల సంఖ్య పెరిగేందుకు దోహదం చేసిందని చెప్పవచ్చు.

ఇక, ఈ ఏడాది జనవరి-1 నుంచి నవంబర్-30 మధ్య కాలంలో 1317మంది విదేశీ పర్యాటకులతో కలిపి మొత్తం 5.13లక్షల మంది పర్యాటకులు జమ్మూ కశ్మీర్ ని సందర్శించారు. అయితే ఇందులో 10శాతం మంది ఆంధ్రా,తెలంగాణ రాష్ట్రాల నుంచి వెళ్లినవారే. ఇక,2020లో కోవిడ్ లాక్ డౌన్ కారణంగా కశ్మీర్ లో పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. గతేడాది కేవలం 41,267మంది పర్యాటకులు మాత్రమే కశ్మీర్ ని సందర్శించారు.

ALSO READ Punjab Election : బీజేపీలో చేరితే డబ్బు,మంత్రి పదవి ఇస్తామన్నారు..ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు