ఆంక్షలు ఎత్తివేత…కశ్మీర్ కి టూరిస్టులకు రావచ్చు

  • Published By: venkaiahnaidu ,Published On : October 8, 2019 / 11:41 AM IST
ఆంక్షలు ఎత్తివేత…కశ్మీర్ కి టూరిస్టులకు రావచ్చు

గురువారం(సెప్టెంబర్-8,2019)నుంచి జమ్మూకశ్మీర్ లో ఆంక్షలు పూర్తిగా ఎత్తియేయనున్నారు. రెండు నెలలకు పైగా కశ్మీర్‌ లోయలో కొనసాగిన భద్రతాపరమైన ఆంక్షలను ఎత్తివేయాలని జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అధికారులను సోమవారం ఆదేశించారు. కశ్మీర్‌ను పర్యాటకులు వీడాలని జారీ చేసిన ఆంక్షలను తక్షణం ఎత్తివేయాలని గవర్నర్ ఆదేశించారు. ఈ నెల 10 నుంచి పర్యాటకులను కశ్మీర్ లోకి అనుమతించనున్నారు.  గవర్నర్ సలహాదారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఇంతకుముందు ఉగ్ర ముప్పు ఉన్నందున పర్యాటకులు, అమర్‌నాథ్ యాత్ర భక్తులు సాధ్యమైనంత త్వరగా కశ్మీర్ లోయను వీడాలని ఈ ఏడాది ఆగస్టు 2న జమ్ముకశ్మీర్ యంత్రాంగం ఆదేశించడం, ఆ తర్వాత ఆగస్టు ఐదో తేదీన ఆర్టికల్  370  రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రప్రభుత్వం విభజించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కశ్మీర్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది.

అయితే కశ్మీర్ లో కర్ఫ్యూ కారణంగా సందర్శకుల సంఖ్య గణనీయంగా పడిపోవటం వలన తాముతీవ్రంగా దెబ్బతిన్నామని టూరిస్ట్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక సమాచారం ప్రకారం…ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో 5 లక్షలకు పైగా ప్రజలు కశ్మీర్ లోయను సందర్శించారు. అంతేకాకుండా, ఉగ్రవాద హెచ్చరిక కారణంగా అమర్‌నాథ్ యాత్ర నిలిపివేయబడటానికి ముందు జూలైలో 3.4 లక్షల మంది యాత్రికులు కూడా వ్యాలీని సందర్శించారు.