Tourists : పర్యాటకులకు నెటిజన్ల హెచ్చరిక.. మీరు మారకపోతే మరో ముప్పు తప్పదు.

మైదాన ప్రాంతాల్లో ఎండలు అధికంగా ఉండటంతో సేద తీరేందుకు చాలామంది శీతల ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో పర్యాటకుల తాకిడి పెరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది యాత్రికులు ఈ రెండు రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీంతో దర్శనీయ ప్రదేశాలు, జలపాతాల వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది.

Tourists : పర్యాటకులకు నెటిజన్ల హెచ్చరిక.. మీరు మారకపోతే మరో ముప్పు తప్పదు.

Tourists

Tourists : మైదాన ప్రాంతాల్లో ఎండలు అధికంగా ఉండటంతో సేద తీరేందుకు చాలామంది శీతల ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో పర్యాటకుల తాకిడి పెరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది యాత్రికులు ఈ రెండు రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీంతో దర్శనీయ ప్రదేశాలు, జలపాతాల వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది.

ఉత్తరాఖండ్ ముస్సోరీలోని కెంప్టీ జలపాతం వద్ద పర్యాటకుల తాకిడి అధికంగా ఉంది. అయితే ఇక్కడ పర్యాటకులు కరోనా నిబంధనలు మరిచి ప్రవర్తిస్తున్నారు. మాస్కు లేకుండా జలపాతంలో జలకాలాడుతూ కేరింతలు కొడుతున్నారు. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. థర్డ్ వేవ్ కు వీరు ఆద్యం పోస్తున్నారని కొందరు అంటే మీ తలల్లో బుర్ర లేదంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. మరో నెటిజన్ “కెంప్టీలో ఖాళీ మెదళ్ళు” అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. ఇక పర్యాటకుల తాకిడి విషయంలో ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. తాము ఊహించిన దానికంటే ఎక్కువమంది పర్యాటకులు వచ్చారని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు హోటల్స్ లో గదుల కొరత ఉందని హోటల్స్ యజమానులు చెబుతున్నారు.