కొప్పల్ ‌లో దేశ‌పు తొలి బొమ్మ‌ల త‌యారీ క్ల‌స్ట‌ర్…5ఏళ్లలో 40వేల ఉద్యోగాలు

  • Published By: venkaiahnaidu ,Published On : August 30, 2020 / 08:57 PM IST
కొప్పల్ ‌లో దేశ‌పు తొలి బొమ్మ‌ల త‌యారీ క్ల‌స్ట‌ర్…5ఏళ్లలో 40వేల ఉద్యోగాలు

కర్ణాట‌క‌లోని కొప్ప‌ల్ ‌లో దేశపు తొలి బొమ్మ‌ల త‌యారీ క్ల‌స్ట‌ర్ ఏర్పాటు కానున్న‌ట్లు ఆ రాష్ట్ర సీఎం య‌డియూర‌ప్ప తెలిపారు. ప్ర‌ధాని మోదీ విజ‌న్‌కు అనుగుణంగా ఈ టాయ్ క్ల‌స్ట‌ర్‌ను ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ‌హితంగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంద‌న్నారు. . 400 ఎక‌రాల సెజ్‌లో అత్యున్న‌త‌స్థాయి సౌక‌ర్యాల‌ను క‌లిగి ఉంటుంద‌ని తెలిపారు.

కొప్ప‌ల్ ‌లో ఏర్పాటు కానున్న బొమ్మ‌ల త‌యారీ క్ల‌స్ట‌ర్ ద్వారా రానున్న ఐదేళ్ల‌లో 40 వేల ఉద్యోగాల సృష్టించబడతాయని, రూ. 5 వేల కోట్ల పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌నున్న‌ట్లు య‌డియూర‌ప్ప ట్వీట్ చేశారు. ప్రపంచ బొమ్మల కేంద్రంగా నిలిచేందుకు భారత్​ కు శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ఇవాళ ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన తరువాత యడియూరప్ప ట్వీట్ చేశారు.

ప్రధాని తన ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో… వోకల్ ఫర్‌ లోకల్ ‌లో భాగంగా దేశీయంగా బొమ్మలు తయారీ చేసేందుకు ముందుకు రావాలని స్టార్టప్‌ కంపెనీలు, యువతను కోరారు. ప్రపంచం మొత్తానికి బొమ్మలకు ప్రధాన కేంద్రంగా నిలిచేందుకు భారత్​ కు శక్తిసామర్థ్యాలు ఉన్నాయని మోడీ అన్నారు. బొమ్మల పరిశ్రమ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు మోదీ. ఈ రంగంలో భారత్ వాటా చాలా తక్కువగా ఉందని.. మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.