చెప్పులు వేసుకోలేదని, చొక్కా గుండీలు పెట్టుకోలేదని జరిమానా

కొత్త మోటార్‌ వాహన సవరణ చట్టంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పులు వేసుకోలేదని, చొక్కా గుండీలు పెట్టుకోకుండా వాహనం నడిపాడని టాక్సీ డ్రైవర్‌కి చలానా విధించారు.

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 04:05 AM IST
చెప్పులు వేసుకోలేదని, చొక్కా గుండీలు పెట్టుకోలేదని జరిమానా

కొత్త మోటార్‌ వాహన సవరణ చట్టంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పులు వేసుకోలేదని, చొక్కా గుండీలు పెట్టుకోకుండా వాహనం నడిపాడని టాక్సీ డ్రైవర్‌కి చలానా విధించారు.

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్‌ వాహన సవరణ చట్టంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి అధిక మొత్తంలో జరిమానాలు విధిస్తూ.. జేబు గుల్ల చేస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. కారులో హెల్మెట్‌ పెట్టుకోలేదని, లుంగీతో వాహనం నడిపారంటూ వింత కారణాలు చూపిస్తూ జరిమానాలు విధించడంపై పోలీసులు విమర్శల పాలవుతున్నారు. అలాంటి సంఘటనే మరొకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. 

చెప్పులు వేసుకోలేదని, చొక్కా గుండీలు పెట్టుకోకుండా వాహనం నడిపాడని మథోసింగ్‌ అనే టాక్సీ డ్రైవర్‌కి చలానా విధించారు. కానీ జరిమానా మొత్తాన్ని కోర్టు నిర్ణయిస్తుందని తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సెప్టెంబర్‌ (6, 2019) చోటు చేసుకుంది. కాగా రాజస్తాన్‌ ప్రభుత్వం కొత్త మోటారు వాహన చట్టం అమలులోకి రాలేదు.

దీనిపై రాజస్థాన్ రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సింగ్ ఖచారియావాస్ మాట్లాడుతూ తాము ఇంకా నూతన మోటారు వాహన చట్టాన్ని అమలు చేయలేదన్నారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు అవలంభించే విధానాన్ని గమనిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గుజరాత్ ఈ చట్టాన్ని నీరుగార్చి అమలు చేసిందని…తాము వారి కంటే సాధ్యమైనంత తక్కువ జరిమానాల అమలుకు ప్రయత్నిస్తామని చెప్పారు.