Traffic Rules : మీ వాహనం ‘స్టాప్‌ లైన్‌’దాటిందా? అయితే తప్పదు భారీ జరిమానా.. ‘గీత’ దాటినందుకు ఒక్కరోజే 3,702 కేసులు నమోదు

‘గీత’దాటితే జేబులు ఖాళీ అవుతాయని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. కొంతమంది రెడ్ సిగ్నల్ పడినా వాహనాలపై రయ్ మంటూ దూసుకుపోతుంటారు. మరికొంతమంది జీబ్రాలైన్ మీదకు వచ్చేస్తుంటారు. కానీ ఇకపై అలా కుదరదు అంటున్నారు తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు. స్టాప్ లైన్ టచ్ చేస్తే భారీ జరిమానా తప్పదంటున్నారు. ‘స్టాప్‌ లైన్‌’కు వాహనం టచ్ అయితే భారీ జరిమానా తప్పదంటున్నారు.

Traffic Rules : మీ వాహనం ‘స్టాప్‌ లైన్‌’దాటిందా? అయితే తప్పదు భారీ జరిమానా.. ‘గీత’ దాటినందుకు ఒక్కరోజే 3,702 కేసులు నమోదు

traffic Rules violation 3702 cases registered in chennai

Traffic Rules : ‘గీత’దాటితే జేబులు ఖాళీ అవుతాయని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. పనిమీద బయటకు వెళ్లినప్పుడో, లేదా ఆఫీసులకు వెళ్లాల్సిన సమయాల్లో కొంతమంది రెడ్ సిగ్నల్ పడినా వాహనాలపై రయ్ మంటూ దూసుకుపోతుంటారు. మరికొంతమంది జీబ్రాలైన్ మీదకు వచ్చేస్తుంటారు. ఇలా గ్రీన్ సిగ్నల్ పడితే అలా దూసుకుపోవచ్చే ఆలోచనతో. కానీ ఇకపై అలా కుదరదు అంటున్నారు తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు. స్టాప్ లైన్ టచ్ చేస్తే భారీ జరిమానా తప్పదంటున్నారు. ‘స్టాప్‌ లైన్‌’కు వాహనం టచ్ అయితే భారీ జరిమానా తప్పదంటున్నారు. అలా నిబందనలు అతిక్రమిస్తే భారీ జరిమానాతో పాటు కేసు నమోదు కూడా దప్పదని హెచ్చరిస్తున్నారు. అలా నిబందనలు అతిక్రమించినవారిపై కేసులు నమోదు చేశారు. సోమవారం (ఫిబ్రవరి 27,2023) ఒక్కరోజునే 3,702 కేసుల నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదాల నివరాణకు అధికారులు ట్రాఫ్రిక్‌ నిబంధనలను అంతకంతకు కఠినతరం చేస్తున్నారు. ముఖ్యంగా హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ లేకపోతే జరిమానాలు తప్పటంలేదు. అంతేకాదు హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడిపినా. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడిపినా మద్యం తాగి డ్రైవింగ్‌ చేసే వాహనదారులకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయినా చాలామంది నిర్లక్షం వహిస్తున్నారు. వారి ప్రాణాలకే కాదు ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు. దీంతో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేస్తూ అతివేగం, సిగ్నల్ రూల్స్‌ పాటించకపోయిన జేబుకు చిళ్లుపడటం ఖాయమంటున్నారు తమిళనాడు ట్రాఫిక్‌ పోలీసులు. చెన్నై నగరవ్యాప్తంగా పోలీసులు గస్తీ చేపట్టి రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారిపై భారీగా కేసులు నమోదుచేసి..భారీ మొత్తంలో జరిమానా వసూలు చేస్తున్నారు.

సాధారణంగా ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద రెడ్‌ లైట్‌ పడితే వాహనదారులు తమ వాహనాలను ‘స్టాప్‌ లైన్‌’కు ముందు నిలుపుతారు. కానీ చాలామంది గీత దాటి ముందుకొస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గమనించారు. దీంతో ఇతర మార్గాల్లో వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి వారిపై కూడా ట్రాఫిక్‌ పోలీసులు గట్టి నిఘా వేశారు. సిగ్నల్‌ పడినప్పుడు స్టాప్‌లైన్‌ను దాటి ముందుకెళ్లిన వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఒక్క సోమవారం (ఫిబ్రవరి 27,2023) చెన్నైలోని 150 ప్రధాన సిగ్నళ్ల వద్ద 3,702 కేసుల నమోదు చేశారు. సీసీ కెమెరాల ద్వారా స్టాప్‌ లైన్‌ దాటిన వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.