Dancing Man Dies On Stage : వినాయక చవితి వేడుకల్లో తీవ్ర విషాదం.. డ్యాన్స్ చేస్తూ స్టేజీపైనే గుండెపోటుతో మృతి

గణేశ్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. గణేష్‌ మండపంలో నిర్వహించిన భజనలో హనుమంతుడు వేషం వేసిన కళాకారుడు డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయాడు.

Dancing Man Dies On Stage : వినాయక చవితి వేడుకల్లో తీవ్ర విషాదం.. డ్యాన్స్ చేస్తూ స్టేజీపైనే గుండెపోటుతో మృతి

Dancing Man Dies On Stage : గణేశ్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. గణేష్‌ మండపంలో నిర్వహించిన భజనలో హనుమంతుడు వేషం వేసిన కళాకారుడు డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొత్వాలి ప్రాంతంలోని శివాలయంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భజన బృందానికి చెందిన రవి శర్మ అనే కళాకారుడు ఆంజనేయుడి వేషంలో డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించాడు. భజనకు అనుగుణంగా డ్యాన్స్‌ చేశాడు.

కొంతసేపటి తర్వాత మండపంపైనే అతడు అకస్మాత్తుగా బోర్లా పడిపోయాడు. ఇదంతా డ్యాన్స్‌లో భాగమే అని అంతా అనుకున్నారు. రవి శర్మ పైకి లేవడానికి కాసేపు ప్రయత్నించాడు. కానీ లేకలేకపోయాడు. హనుమంతుడు వేషం వేసిన రవి శర్మ చాలా సేపటి వరకు పైకి లేవలేదు. ఇది గమనించిన మండపం నిర్వాహకులు అతడిని లేపే ప్రయత్నం చేశారు. కానీ అతడిలో చలనం లేదు.

దీంతో వెంటనే అతడిని మెయిన్‌పురి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో వారు షాక్ తిన్నారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో రవి శర్మ చనిపోయాడని డాక్టర్లు వెల్లడించారు. రవి శర్మ డ్యాన్స్ చేస్తూ స్టేజిపైనే కుప్పకూలాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

రవి శర్మ వయసు 35ఏళ్లు. అతడు ఓ కళాకారుడు. రవి శర్మ ఆకస్మిక మరణంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. అతడి కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.

 

 

డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి..

 

కాగా, కొన్ని రోజులుగా ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడం ఆందోళనకు గురి చేస్తోంది. చిన్న వయసు వారు కూడా ఊహించని విధంగా గుండెపోటుతో మరణించడం కామన్ గా మారింది. అదీ డ్యాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడం, సడెన్ గా కుప్పకూలడం జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బర్త్ డే పార్టీలో హుషారుగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి గుండెపోటు రావడంతో స్టేజీపైనే కుప్పకూలి మరణించాడు.

ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బ‌రేలీలో జ‌రిగింది. త‌న స్నేహితుడి బ‌ర్త్ డే పార్టీకి హాజ‌రైన ప్రభాత్ కుమార్(48) తనకు ఇష్టమైన బాలీవుడ్ పాటకు స్టేజీపైన‌ హుషారుగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ అంద‌రూ చ‌ప్ప‌ట్లు కొడుతుంటే ఇంకా జోష్‌గా స్టెప్పులేశాడు. అంతలోనే అక‌స్మాత్తుగా కుప్ప‌కూలిపోయాడు. ఇది కళ్లారా చూసినోళ్లు షాక్ తిన్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రభాత్ కన్నుమూశాడు.

ప్రభాత్ స్టేజీపైనే ప‌డిపోయిన వెంటనే.. అక్కడే ఉన్న అతిథుల్లో ఒక డాక్టర్ వచ్చి వెంట‌నే సీపీఆర్ కూడా చేశారు. అయినా, ప్ర‌భాత్‌ ప్రాణాలు ద‌క్క‌లేదు. అత‌డు పార్టీకి హాజరయ్యే ముందు బ్యాడ్మింటన్ కూడా ఆడాడ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. త‌మ క‌ళ్ల‌ముందే స్నేహితుడు కుప్ప‌కూలిపోవ‌డంతో స్నేహితులంతా విషాదంలో మునిగిపోయారు.

 

బర్త్ డే పార్టీలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు