భోపాల్ గ్యాస్ బాధితులు కరోనాకు బలైపోతున్నారు

  • Published By: venkaiahnaidu ,Published On : April 21, 2020 / 03:06 PM IST
భోపాల్ గ్యాస్ బాధితులు కరోనాకు బలైపోతున్నారు

వేలాది మంది ప్రాణాలు తీసిన 1984 భోపాల్ గ్యాస్ విషాదం…ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యొక్క పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 మధ్య రాత్రి మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీక్ కావడంతో 20,000 మందికి పైగా మరణించారు. ఇప్పటికి కూడా అనేకమంది దీని కారణంగా అనారోగ్యానికి గురౌతున్నారు. 

అయితే 36ఏళ్ల క్రితం ఆ విషవాయువు నుంచి బతికి బయటపడ్డ వారు ఇప్పుడు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. భోపాల్ లో ఇలాంటి మరణాలు ఇప్పటివరకు ఏడు నమోదయ్యాయి. భోపాల్ గ్యాస్ ప్రమాద బాధితుల్లో 7గురు కరోనాతో మరణించినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఐదుగురు భోపాల్ గ్యాస్ బాధితులు ప్రాణాలు కోల్పోగా ఏప్రిల్‌ 17న 70ఏళ్ల భోపాల్ గ్యాస్ బాధితుడు మృతి చెందగా. 60 ఏండ్ల వ్యక్తి ఏప్రిల్‌ 14వ తేదీన మరణించాడు. చనిపోయిన తర్వాత వీరిద్దరికి టెస్ట్ లు చేయగా కరోనా పాజిటివ్ అని తేలినట్లు అధికారులు ప్రకటించారు.

దీంతో మొత్తం 7గురు భోపాల్ గ్యాస్ బాధితులు కరోనా సోకి చనిపోయారు. 1984 టాక్సిస్‌ గ్యాస్‌ విషాదం నుంచి బయటపడిన వారు కరోనా వైరస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నారని భోపాల్‌ గ్రూప్‌ ఫర్‌ ఇన్ఫర్‌మేషన్‌ ఆక్షన్‌ ఎన్‌జీవోలో పనిచేసే  రచనా ఢింగ్రా తెలిపారు. భోపాల్‌ విషాద బాధితులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.విషవాయువు ఘటన నుంచి బయటపడిన వారికి కరోనా  వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని వారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి సూచిస్తున్నారు అధికారులు.

భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (BMHRC) గ్యాస్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడినవారికి చికిత్స కోసం అంకితమైన సదుపాయం. అయితే ఇది ఇటీవలే కరోనావై రస్ రోగులకు వైద్య సదుపాయంగా మార్చబడింది. దీంతో గ్యాస్ బాధిత ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఐదు మరణాలపై ఆగ్రహం తరువాత, గ్యాస్ విషాద బాధితులకు సౌకర్యంగాBMHRCని మార్చింది ప్రభుత్వం. భోపాల్‌కు చెందిన మొదటి కరోనావైరస్ బాధితుడు, 55 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 5 న నగర ఆసుపత్రిలో మరణించినట్లు ధింగ్రా తెలిపారు.