Odisha: ఒడిశాలో టీసీ లేకుండానే వెళ్లిపోయిన రైలు.. వీడియో వైరల్

లోకో పైలట్ లేకుండానే రైలు ప్లాట్‌ఫామ్ నుంచి వెళ్లిపోయిన ఘటన తాజాగా ఒడిశాలో చోటు చేసుకుంది. కోరాపుట్ పట్టణ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Odisha: ఒడిశాలో టీసీ లేకుండానే వెళ్లిపోయిన రైలు.. వీడియో వైరల్

Odisha: రైలు ప్లాట్‌పామ్‌పై నుంచి కదలాలంటే టికెట్ చెకర్ (టీటీఈ)తోపాటు గార్డు కూడా ఉండాలి. కానీ, ఒడిశాలో తాజాగా ఒక రైలు టీటీఈ/టీసీ, గార్డు లేకుండానే వెళ్లిపోయింది. ఈ ఘటనను అక్కడున్న ఒక వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేశాడు. ఒడిశా, కోరాపుట్ రైల్వే స్టేషన్ నుంచి కిరందుల్-విశాఖపట్నం ప్యాసింజర్ ట్రైన్ బయలుదేరాల్సి ఉంది.

Indian Airfield: చైనాకు భారత్ కౌంటర్‌.. యుద్ధక్షేత్రంలో ఉపయోగపడేలా లదాఖ్‌లో ఎయిర్ ఫీల్డ్ నిర్మాణం

అయితే, ప్లాట్‌ఫామ్‌పై టీటీఈ, గార్డు వేరే వాళ్లతో మాట్లాడుతూ ఉండగానే రైలు అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఇది చూసి ఆ ఇద్దరూ ఒక్కసారి షాకయ్యారు. టీటీఈ చేయి ఊపి, లోకో పైలట్‌కు విషయం చెప్పాలనుకున్నప్పటికీ సాధ్యం కాలేదు. రైలు అలాగే వెళ్లిపోయింది. అయితే, అక్కడున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది.. తమ వాకీ టాకీ ద్వారా లోకో పైలట్‌కు సమాచారం చేరవేశారు. దీంతో కొంత దూరం వెళ్లిన తర్వాత మధ్యలో రైలును ఆపేశారు. ఆ తర్వాత కొంతసేపటికి టీటీఈ, గార్డ్ ఇద్దరూ అక్కడికి చేరుకుని రైలెక్కి వెళ్లిపోయారు. ఈ ఘటనను అక్కడున్న వారెవరో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.