5 నిమిషాల ముందు కూడా ట్రైన్ టిక్కెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు..

  • Published By: nagamani ,Published On : October 9, 2020 / 03:30 PM IST
5 నిమిషాల ముందు కూడా ట్రైన్ టిక్కెట్  రిజర్వేషన్ చేసుకోవచ్చు..

train ticket reservation befor 5 minutes: భారత రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ఐదు నిమిషాల ముందు కూడా రైల్ టిక్కెట్ రిజర్వేషన్ చేయించుకునే సౌకర్యాన్ని కల్పించింది. అక్టోబర్ 10నుంచి అంటే రేపటి నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపింది. రైలు స్టేషన్ నుంచి బయలుదేరే 5 నిమిషాల మందుకూడా టిక్కెట్ రిజర్వు చేయించుకోవచ్చని తెలిపింది.


రైలు బయలుదేరే అర్థగంట ముందే చార్టును తయారుచేసే ప్రీ-కోవిడ్ వ్యవస్థను పునరుద్ధరించాలని భారత రైల్వే నిర్ణయించింది. గతంలో 2 గంటల ముందు సెకండ్ రిజర్వేషన్ చార్ట్ అందుబాటులో ఉంచేవారు. కరోనా వైరస్ కారణంగా షెడ్యూల్ లో మార్పులు చేశారు. సెకండ్ రిజర్వేషన్ చార్ట్ తయారు చేసేవరకు కూడా టికెట్లను విక్రయించనున్నారు.


కరోనా వైరస్ వల్ల రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది. ఈ క్రమంలో నిర్దేశిత స్టేషన్ నుంచి రైలు బయల్దేరే సమయానికి 5 నిమిషాల ముందు కూడా సీట్లను రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అలాగే ప్రయాణానికి అరగంట ముందు సెకండ్ రిజర్వేషన్ చార్ట్ అందుబాటులో ఉంచుతామని రైల్వేశాఖ తెలిపింది.


కాగా..ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో కూడా రైలు టిక్కెట్లు లభ్యం కానున్నాయి. ఐఆర్సీటీసీ, అమెజాన్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. అమెజాన్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ప్రయాణం మొదలుకావడానికి కొన్ని గంటల ముందువరకు ఏ సమయంలోనైనా టికెట్లను క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు.



ఇప్పటికే అమెజాన్ యాప్ ద్వారా విమాన, బస్సు టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అమెజాన్ యాప్ ద్వారా మొదటిసారి టికెట్లు బుక్ చేసే కస్టమర్లకు 10 శాతం నగదు డిస్కౌంట్ లభించనుందని అమెజాన్ తెలిపింది.