India’s Migrants : సొంతూళ్లకు పయనం, కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లు!

పనులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. గత సంవత్సరం కూడా వేలాది మంది కాలి నడకన సొంత గ్రామాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో రద్దీ నెలకొంది.

India’s Migrants : సొంతూళ్లకు పయనం, కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లు!

Migrants

Mumbai Railway Station : గత సంవత్సరం ఎలాంటి సీన్స్ కనబడ్డాయో..మరలా అదే పరిస్థితి కనబడుతోంది. కరోనా వైరస్ రెండోసారి పంజా విసురుతోంది. భారతదేశంలో లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, సెమీ లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఎక్కువగా మహారాష్ట్ర రాష్ట్రం కరోనాతో విలవిలాడుతోంది. 15 రోజలు పాటు జనతా కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ ప్రభావం వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

పనులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. గత సంవత్సరం కూడా వేలాది మంది కాలి నడకన సొంత గ్రామాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో రద్దీ నెలకొంది. కుర్లాలోని లోకమాన్య తిలక్ టర్మినల్ రైల్వే స్టేషన్ లో విపరీతమైన రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు వస్తుండడంతో పోలీసులు భద్రతను పెంచారు. ప్రజలు ఎవరూ కంగారు పడొద్దని..కేవలం టికెట్ కన్ఫామ్ అయిన వారు మాత్రమే రైల్వే స్టేషన్ కు రావాలని కేంద్ర రైల్వే చీఫ్ శివాజీ సుతార్ వెల్లడించారు. గుంపులు గుంపులుగా ఉండొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

గత 24 గంటల్లో 58 వేల 952 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 278 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. మొత్తం 6 లక్షల 12 వేల 070 యాక్టివ్ కేసులున్నాయి. రాత్రి వేళ కర్ప్యూ కొనసాగుతోంది. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చిన వారికి కేసులు నమోదు చేస్తున్నారు. నాగ్ పూర్ ప్రాంతంలో 5 వేల 993 కేసులు రికార్డయ్యాయి. 3 వేల 993 మంది డిశ్చార్జ్ అయ్యారు. 57 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 97 వేల 036గా ఉంది.

Read More : Physical Inactivity : ఉరుకులు పెట్టండి, పరుగులు తీయండి, వ్యాయామం చేయండి.. లేకపోతే ప్రమాదం – సర్వేల వెల్లడి