పండగ చేస్కోండి : రైళ్లల్లో ఫ్రీ వైఫై

  • Published By: venkaiahnaidu ,Published On : October 24, 2019 / 05:05 AM IST
పండగ చేస్కోండి : రైళ్లల్లో ఫ్రీ వైఫై

అన్నీ భారతీయ రైళ్లలో ఉచిత వైఫై సర్వీసును అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రాబోయే నాలుగేళ్లల్లో ఇది పూర్తి అవుతుందని ఆయన తెలిపారు.

స్వీడన్ పర్యటనలో ఉన్న పియూష్ గోయల్ మాట్లాడుతూ..ఇప్పటివరకు 5వేల150 రైల్వే స్టేషన్లలో ఇప్పటివరకు వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాది చివరి నాటికి మొత్తం 6వేల 500 స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అయితే రైళ్ల లోపల వైఫై సేవల గురించి ఆయన మాట్లాడుతూ..ఇది చాలా సంక్లిష్టమైన టెక్నాలజీ సబ్జెక్టు అని అన్నారు. నడుసుస్తున్న రైళ్లల్లో వైఫై సేవలు అందించేందుకు పెట్టుబడి అవసరమన్నారు. కొత్తగా టవర్లు ఏర్పాటు చేయాలని,ట్రైన్స్ లోపల ఎక్యూప్మెంట్ ఉండాలన్నారు.

దీని కోసం తాము విదేవీ టెక్నాలజీ,ఇన్వెస్టర్లు తీసుకురావాల్సి ఉందన్నారు. వైఫై ఫెసిలిటీ ద్వారా సిగ్నలింగ్ సిస్టమ్ ఇంకా బాగా పనిచేస్తుందన్నారు. ప్రయాణికులకు భద్రత పరంగా కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని,ప్రతీ ట్రైన్ కంపార్ట్మెంట్లో సీసీటీవీ ఉంటుందని,పోలీస్ స్టేషన్ కి నేరుగా లైవ్ ఫీడ్ వెళ్తుందని అన్నారు. రాబోయే నాలుగు,నాలుగున్నరేళ్లలో ట్రైన్స్ లో వైఫై అందించేందుకు కృషి చేస్తున్నట్లు గోయల్ తెలిపారు.