పాత ఫోన్‌లో WhatsApp Chats కొత్త ఫోన్లోకి పంపొచ్చు!

  • Published By: sreehari ,Published On : January 3, 2020 / 10:48 AM IST
పాత ఫోన్‌లో WhatsApp Chats కొత్త ఫోన్లోకి పంపొచ్చు!

కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నారా? పాత ఫోన్లో వాట్సాప్ మెసేజ్ లను కొత్త ఫోన్లోకి ట్రాన్స్ ఫర్ ఎలా చేయాలా? అని ఆలోచిస్తున్నారా? ఇదిగో ప్రాసెస్.. ఇలా ప్రయత్నించి చూడండి.. పాత వాట్సాప్ మెసేజ్ డేటాను ఈజీగా కొత్త ఫోన్లోకి మార్చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఆండ్రాయిడ్, iOS రెండు డివైజ్ ల్లోనూ వర్క్ అవుతుంది.  ప్రస్తుత యాప్ మార్కెట్లో వాట్సాప్ మెసేజ్ లను ట్రాన్స్ ఫర్ చేయడానికి బోలెడు థర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

అందులో ప్రతి యాప్.. మీ వాట్సాప్ మెసేజ్‌లను పూర్తి స్థాయిలో ట్రాన్స్ ఫర్ చేయలేదు. ప్రత్యేకించి.. కొత్త స్మార్ట్ ఫోన్, పాత స్మార్ట్ ఫోన్ వేర్వేరు కంపెనీలు తయారు చేసి ఉంటాయి కూడా. అయినా నో ప్రాబ్లమ్.. పాత వాట్సాప్ మెసేజ్ లను మీ కొత్త స్మార్ట్ ఫోన్లోకి ఈజీగా పంపుకోవచ్చు. ఇందుకు రెండు మెథడ్స్ ఉన్నాయి. ఈ కింది విధంగా ఫాలో అవ్వండి చాలు.. 

1. Google Drive లేదా iCloud Store వాడొచ్చు :
మీరు వాడే స్మార్ట్ ఫోన్ ఏ డివైజ్ అనేది క్లారిటీ ఇవ్వండి. అది Android డివైజ్ కావొచ్చు లేదా iPhone కావొచ్చు. మీరు ఎంచుకునే డివైజ్ బట్టి ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఆండ్రాయిడ్ డివైజ్ అయితే.. Google Drive వాడండి.. ఐఫోన్ అయితే మాత్రం iCloud స్టోర్ వాడండి. 

* ఆండ్రాయిడ్ డివైజ్ లోని వాట్సాప్ పాత చాట్ Backup తీసుకోవాల్సి ఉంటుంది. 
* మీ పాత ఫోన్లో Gmail అకౌంట్లో Login అవ్వండి.. Google Drive Backup యాక్టివేట్ అవుతుంది.
* WhatsApp Settings > Chats > Chat Backup సెలెక్ట్ చేసుకోండి.
* Media files లేదా కేవలం Chat.. ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్యాకప్ సహా ఎంచుకోండి.
* కొత్త Smartphone అదే జీమెయిల్ అకౌంట్ తో Login అవ్వండి.
* Whatsapp యాప్ Login చేసిన వెంటనే మీకో Prompt మెసేజ్ వస్తుంది.
* మీ Google Drive Account నుంచి Restore Chat History అని కనిపిస్తుంది.
* ఇక్కడ మీకు రెండు ఎంపికలు ఉంటాయి. Restore, Skip అని ఉంటాయి.
* Backup Your chat History ఎంచుకుంటే చాలు.. కొత్త ఫోన్లోకి పాత చాట్ రీస్టోర్ అవుతుంది. 

whatsapp chat

Note : ఆండ్రాయిడ్ మాదిరిగానే iPhone డివైజ్‌‌లో కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి.

Method-2 : Local backup నుంచి Restore చేయడం :
 పాత వాట్సాప్ ఫోన్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్‌కు గూగుల్ డ్రైవ్ మెథడ్ ద్వారా ఈజీగా చాట్ హిస్టరీ బ్యాకప్ తీసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ ఎక్కువ మొత్తంలో డేటాకు మాత్రమే అవసరమని మీరు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. దీనికి మరో మెథడ్ ఉందండోయ్..వాట్సాప్ చాట్ హిస్టరీని Local Storageలో Backup తీసుకోవచ్చు. అక్కడి నుంచి ఈజీగా మీ కొత్త ఫోన్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. 

* పాత Phoneలో వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేయండి.
* WhatsApp Settings > Chats > Chat Backup ఎంచుకోండి.
* ఇక్కడ మీకు Green ‘Backup’ అనే Button ఉంటుంది.
* ఈ బటన్ పై క్లిక్ చేస్తే చాలు Locally మీ ఫోన్లో చాట్ Backup అవుతుంది.
* Backup File మీ Whatsapp > Databases Local Storage Folderలోకి వెళ్తుంది. 
* ఈ Backup File లేటెస్ట్ డేట్ తో కొత్త ఫోన్లోకి Send చేయండి. 
* Whatsapp >Databases folder ఓపెన్ చేసి Restore చేయండి. 
* ఒకవేళ Folder లేకపోతే.. కొత్తది Folder Create చేయండి. 
* ఆ తర్వాత Copy చేసిన Backup fileను కొత్త ఫోన్లోకి పంపండి.
* Whatsapp అకౌంట్లోకి Login అవ్వండి.. చాట్స్ కొత్త ఫోన్లోకి కాపీ అవుతాయి.
* Chat backup చేస్తే.. ఏదైనా Error వస్తే కొత్త ఫోన్లో Whatsapp Uninstall చేయండి.
* Whatsapp App Install చేసి మళ్లీ Backup చేసేందుకు ప్రయత్నించండి.
* వాట్సాప్ అకౌంట్లో Login అయ్యే ముందు వాట్సాప్ Database folderలో Backup File ఉండాలి. 
* మీ పాత వాట్సాప్ చాట్ డేటా కొత్త ఫోన్లోని వాట్సాప్ లోకి ట్రాన్స్ ఫర్ అవుతుంది. 
Chat screen