Delta Plus Variant : మహారాష్ట్ర నుంచి గోవాకు వెళ్తున్నారా? ‘డెల్టా ప్లస్’తో జరభద్రం..!

మహారాష్ట్రలో కొవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ డెల్టా ప్లస్ కేసులు పక్క రాష్ట్రాలకు కూడా పాకుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్.. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు అలర్ట్ ప్రకటించారు.

Delta Plus Variant : మహారాష్ట్ర నుంచి గోవాకు వెళ్తున్నారా? ‘డెల్టా ప్లస్’తో జరభద్రం..!

Traveling To Goa From Maharashtra

Delta Plus Variant : మహారాష్ట్రలో కొవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ డెల్టా ప్లస్ కేసులు పక్క రాష్ట్రాలకు కూడా పాకుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్.. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు అలర్ట్ ప్రకటించారు. గోవాలో డెల్టా వేరియంట్ కేసు ఒకటి గుర్తించినట్టు వెల్లడించారు. కానీ, ఇప్పటివరకూ తీర ప్రాంతమైన గోవాలో ఒక డెల్టా ప్లస్ సింగిల్ కేసు కూడా నమోదు కాలేదు.

మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్.. గోవాకు అనుకుని ఉన్న సింధుదర్గ్ లో కనిపించింది. దాంతో సమీప సరిహద్దుల్లో ప్రజలను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు సీఎం పేర్కొన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు 21 వరకు నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపి తెలిపారు. అందులో రత్నగిరిలో తొమ్మిది కేసులు నమోదు కాగా.. జల్గాన్ లో ఏడు కేసులు నమోదయ్యాయి. ముంబైలో రెండు కేసులు, పల్హర్ లో ఒక కేసు, థానె, సింధుదర్గ్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. అలాగే గోవాలో ఇప్పటివరకూ కొవిడ్ డెల్టా వేరియంట్ కేసులు 26 వరకు నమోదయ్యాయని సావత్ వెల్లడించారు.

పూణెలోని ల్యాబరేటరీలో శాంపిల్స్ ద్వారా నిర్ధారించినట్టు తెలిపారు. పూణెకి చెందిన ల్యాబ్‌లో శాంపిల్స్ ద్వారా డెల్టా వేరియంట్ కు సంబంధించినదో కాదో నిర్ధారించనున్నారు. ఇటీవలే సీఎం సావత్.. టూరిజం కార్యకలాపాలకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించారు. జూలై తర్వాత నుంచి గోవాలో పర్యాటకుల సందర్శనకు అనుమతిచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు గతవారమే ఆయన తెలిపారు. జూలై 30 నాటికి రాష్ట్రంలో కొవిడ్ మొదటి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు.