బిగ్ రిలీఫ్ : మెట్రో రైళ్లలో కొత్త రూల్స్.. మీ లగేజీ బరువు పెరిగింది

మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్. మెట్రో రైళ్లలో కొత్త రూల్స్ వచ్చాయి. మినిస్టరీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (MoHUA) లగేజీ నిబంధనల్లో మార్పులు చేసింది.

  • Published By: sreehari ,Published On : September 2, 2019 / 10:39 AM IST
బిగ్ రిలీఫ్ : మెట్రో రైళ్లలో కొత్త రూల్స్.. మీ లగేజీ బరువు పెరిగింది

మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్. మెట్రో రైళ్లలో కొత్త రూల్స్ వచ్చాయి. మినిస్టరీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (MoHUA) లగేజీ నిబంధనల్లో మార్పులు చేసింది.

మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్. మెట్రో రైళ్లలో కొత్త రూల్స్ వచ్చాయి. మినిస్టరీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (MoHUA) లగేజీ నిబంధనల్లో మార్పులు చేసింది. దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లలో ప్రయాణికులు తీసుకెళ్లే లగేజీ బరువు పెరిగింది. ఇప్పటివరకూ మెట్రోలో ప్రయాణికుల లగేజీ 15కిలోలు వరకు మాత్రమే అనుమతి ఉంది. మెట్రో రైల్వే (క్యారేజీ అండ్ టికెట్) 2014 నిబంధనల్లో MoHUA మార్పులు చేస్తున్నట్టు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఇకపై ప్రయాణికుల లగేజీ 25కిలోలు వరకు అనుమతి ఇస్తారు.

సాధారణంగా మెట్రోలో ఎక్కువ దూరం ప్రయాణించే సమయంలో ప్యాసెంజర్లు తమ వెంట భారీ లగేజీ తీసుకు వెళ్తుంటారు. మెట్రో లగేజీ రూల్స్ కారణంగా 15 కిలోల బరువు ఉన్న లగేజీ మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతించే వారు. ఈ కొత్త రూల్స్ కారణంగా మెట్రో ప్రయాణికులు తమ లగేజీని 25కిలోల వరకు ఈజీగా తీసుకెళ్లొచ్చు.

ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మెట్రో రైల్వేలో ప్రయాణించే వ్యక్తి తన వెంట ఏదైనా లగేజీ పరిమాణం 80 సెంమీ x 50 సెంమీ x 30 సెంమీ కంటే అధిగమించకూడదు. అంటే.. మొత్తం బరువు 25 కిలోలు వరకు ఉండొచ్చు. ఎయిర్ పోర్టులకు సంబంధించి మెట్రో ట్రైన్లలో ఒక బ్యాగు బరువు 32కిలోల వరకు అనుమతి ఇస్తారు. కానీ, బండెల్స్ బ్యాగేజీలను మాత్రం అనుమతించరు. ఎయిర్ పోర్టు రూటులో మెట్రోలో వెళ్లే వ్యక్తి తన వెంట రెండు బ్యాగుల కంటే ఎక్కువగా తీసుకెళ్లరాదు.

రెండు బ్యాగులు కలిపి మొత్తం 90సెంమీ x 75సెంమీ x 45సెంమీ సైజుతో మొత్తం బరువు 32 కిలోలు మించరాదు అని నోటిఫికేషన్‌లో మెట్రో రైల్వే అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఢిల్లీ మెట్రో ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ లైన్ ద్వారా వెళ్లే మెట్రో రూట్లలో ఢిల్లీ మెట్రో బ్లూ లైన్ కనెక్ట్ అయి ఉంది. ఈ మార్గంలో ఎయిర్ పోర్టు మార్గంలో రోజు మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి.