Sick Elephant: అనారోగ్యంతో ఏనుగు.. రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్యతో అందని చికిత్స

అనారోగ్యంతో బాధపడుతున్న ఏనుగుకు చికిత్స అందించకుండా రెండు రాష్ట్రాల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తమిళనాడు-కేరళ సరిహద్దులో, ఏనుగు అటూ ఇటూ తిరుగుతుండటమే అధికారులకు సమస్యగా మారింది.

Sick Elephant: అనారోగ్యంతో ఏనుగు.. రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్యతో అందని చికిత్స
ad

Sick Elephant: అనారోగ్యంతో బాధపడుతున్న ఏనుగుకు రెండు రాష్ట్రాల సరిహద్దు అంశం సమస్యగా మారింది. ఏ రాష్ట్రం వాళ్లు చికిత్స అందించాలో తెలియక.. రెండు రాష్ట్రాల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తమిళనాడు-కేరళ సరిహద్దులోని అనైకట్టి అనే నదీ ప్రాంతంలో ఒక ఏనుగు తిరుగుతుంది.

Telangana RTC Buses: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు, అలారంలు.. ప్రయోగాత్మకంగా అమలు

అయితే, ఆ ఏనుగుకు కొద్ది రోజులుగా జబ్బు చేసింది. దీంతో ఏనుగు చాలా బలహీనంగా తయారైంది. నిలబడటానికి కూడా కష్టమవుతోంది. అనైకట్టి అనే చిన్న నది దగ్గర్లో ఏనుగు పడిపోతోంది. ఇది గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ఈ ఏనుగు అటూ ఇటూ తిరుగుతుండటం సమస్యగా మారింది. ఎందుకంటే ఈ ప్రాంతం తమిళనాడు-కేరళ సరిహద్దులో ఉంటుంది. ఏనుగు ఒకసారి తమిళనాడు వైపు.. మరోసారి కేరళవైపు వెళ్తోంది. దీంతో ఏనుగుకు రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు చికిత్స అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ బాధ్యత మీదంటే.. మీదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు.

Arvind Kejriwal: ఉచితంగా అందించే విద్య, వైద్యం తాయిలాలు కావు: అరవింద్ కేజ్రీవాల్

దీంతో ఏనుగుకు చికిత్స అందించడం ఆలస్యమవుతోంది. తరచూ ఏనుగు రెండు రాష్ట్రాల సరిహద్దులు దాటుతుండటమే వారికి సమస్యగా మారింది. అయితే, జంతు సంరక్షణ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ అంశంపై స్పందించారు. ఏదో ఒక రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు త్వరగా స్పందించి, ఏనుగుకు చికిత్స అందించాలని కోరుతున్నారు. కాగా, ప్రస్తుతం రెండు రాష్ట్రాల అధికారులు ఏనుగు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.