Coimbatore : టీకా వద్దంటూ చెట్టెక్కిన గిరిజనులు

Coimbatore : టీకా వద్దంటూ చెట్టెక్కిన గిరిజనులు

Coimbatore

Coimbatore : టీకాలు వేసేందుకు వచ్చిన అధికారులను చూసి ప్రజలు పరుగులు తీశారు. మాకు టీకాలు వద్దు బాబోయ్ అంటూ చెట్టెక్కారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ సమీపంలోని గిరిజన గూడెంలో జరిగింది. గిరిజన ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి టీకాలు తీసుకోకపోవడంతో గూడెంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వైద్య అధికారులు.

ఈ విషయం గిరిజనులకు తెలియడంతో పరుగులు తీశారు. మాకు టీకాలు వద్దు ఏమి వద్దు ముందు మీరు మా గ్రామం నుంచి వెళ్లిపోండి అంటు వైద్యాధికారులతో వాగ్వాదానికి దిగారు. గ్రామ పెద్ద చెప్పినా వినలేదు. ఇక కొందరు చెట్లు ఎక్కి దాక్కున్నారు. మాకు కరోనా వచ్చినా పర్వాలేదు.. కరోనా టీకా మాత్రం తీసుకోమని చెబుతున్నారు. వైద్యాధికారులు ఎంత బ్రతిమాలిన గిరిజనులు టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.

గిరిజనల తీరు అధికారులకు తలనొప్పిగా మారింది. కాగా కోయంబత్తూర్ పరిసర ప్రాంతాల్లోకి గిరిజన గ్రామాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. అయితే గిరిజన ప్రజలు మాత్రం దీనికి సహకరించడం లేదు. గిరిజన గ్రామాల్లో 10 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. మిగతా వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు సుముఖత చూపడం లేదు.