కరోనా ఎఫెక్ట్ : తాటాకులతో మాస్కులు తయారు చేసిన గిరిజనులు

  • Published By: veegamteam ,Published On : March 27, 2020 / 05:04 AM IST
కరోనా ఎఫెక్ట్ : తాటాకులతో మాస్కులు తయారు చేసిన గిరిజనులు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నుంచి తమని తాము రక్షించుకోవాలని, తమ భద్రత గురించి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఛత్తీస్ ఘడ్ లోని గిరిజనులు చేసిన పని చూడండి. మనస్సుంటే మార్గం ఉంటుందన్నటు ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ ప్రాంత గిరిజనులు తాటి ఆకులతో మాస్కులను తయారు చేసుకోని వారి రక్షణ కల్పించుకున్నారు.

కోవిడ్ 19 కారణంగా కాంకర్, బస్తర్ ప్రాంతాలలోని గిరిజనులు ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఉంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం కోసం ఎదురుచూడకుండా తగ్గు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ఎంత చురుగ్గా ఉన్నారో తెలుస్తుంది. 

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మెుత్తం 3 కేసులు నమోదయ్యాయి. లండన్ నుండి రాయ్ పూర్ తిరిగి వచ్చిన 24 సంవత్సరాల మహిళకు మెుదటిగా కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారించబడింది. కరోనా వైరస్ వ్యాప్తితో రాయ్ పూర్ రాజధానితో సహా రాష్ట్రంలోని ఉన్న మెుత్తం 28 జిల్లాలో ప్రభుత్వం హెల్ప్ లైన్ లతో కూడిన కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది.

భారత దేశంలో శుక్రవారానికి (మార్చి 27, 2020) 733 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 20 మంది చనిపోయారు.