Sayoni Ghosh : త్రిపురలో టీఎంసీ లీడర్ “సాయోని ఘోష్‌” అరెస్ట్

త్వరలో స్థానిక ఎన్నికలు జరుగనున్న త్రిపురలో బీజేపీ-టీఎంసీ పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ లీడర్,బెంగాలీ నటి సాయోని ఘోష్‌ను త్రిపుర పోలీసులు ఆదివారం

Sayoni Ghosh : త్రిపురలో టీఎంసీ లీడర్ “సాయోని ఘోష్‌” అరెస్ట్

Gosh

Tripura Civic Polls  త్వరలో స్థానిక ఎన్నికలు జరుగనున్న త్రిపురలో బీజేపీ-టీఎంసీ పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ లీడర్,బెంగాలీ నటి సాయోని ఘోష్‌ను త్రిపుర పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. శనివారం అగర్తలాలో త్రిపర్ సీఎం బిప్లబ్ దేబ్ హాజరైన ఓ రాజకీయ కార్యక్రమాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ సాయోని ఘోష్‌ను అరెస్ట్ చేశారు. ఆమెపై హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై పశ్చిమ త్రిపుర అదనపు పోలీసు సూపరింటెండెంట్ (అర్బన్) బీజే రెడ్డి మాట్లాడుతూ…”ఓ బహిరంగ సభలో బీజేపీ కార్యకర్తలను చంపేందుకు ప్రయత్నించినందుకుగాను టీఎంసీ యువజన కాంగ్రెస్ చీఫ్ సయోని ఘోష్‌ను అరెస్టు చేయడం జరిగింది. ప్రాథమిక ఆధారాలతో ఆమెను అరెస్టు చేశాం. IPC సెక్షన్ 307, 153 కింద కేసు నమోదు చేశాం” అని బీజే రెడ్డి తెలిపారు.

అయితే, ఈస్ట్ అగర్తల మహిళా పోలీస్ స్టేషన్ బయట అధికార బీజేపీ కార్యకర్తలు తమను చితగ్గొట్టారని టీఎంసీ నేతలు ఆరోపించారు. ఆదివారం సాయాని ఘోష్ బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ఆమెను పిలిచారని, అయితే అందుకు కారణాన్ని మాత్రం వెల్లడించలేదని టీఎంసీ పేర్కొంది. పోలీసులు పిలవడంతో సాయోని ఘోష్, కునాల్ ఘోష్ తదితర టీఎంసీ నేతలు అగర్తల ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారని.. ఆమె ఇంటరాగేషన్ కోసం లోపలికి వెళ్లిన తర్వాత హెల్మెట్లు ధరించిన 25 మంది బీజేపీ కార్యకర్తలు చేతుల్లో కర్రలతో అక్కడికి చేరుకుని తమపై కార్యకర్తలపై దాడిచేసినట్టు టీఎంసీ ఆరోపించింది. పోలీస్ స్టేషన్ వద్ద వారి సమక్షంలోనే తమపై కర్రలతో దాడిచేశారని, రాళ్లు విసిరారని పేర్కొన్నారు. ఈ హింసాకాండలో ఆరుగురు తృణమూల్ మద్దతుదారులు గాయపడ్డారని టీఎంసీ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ట్విట్టర్ లో షేర్ చేశారు.

అయితే, దీనిపై స్థానిక పోలీసులు మాట్లాడుతూ..సాయోని ఘోష్‌ను ప్రశ్నిస్తున్న సమయంలో పోలీస్ స్టేషన్ సమీపంలో గుమిగూడిన వ్యక్తులపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని, అయితే ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. ఇక,టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండించింది.ముఖ్యమంత్రి సభపై సాయోని ఘోష్‌ రాళ్లు రువ్వారని, దుర్భాషలాడారని బీజేపీ ఆరోపించింది.

మరోవైపు, ఈ రాత్రికి 15 మందికి పైగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కోల్‌కతా నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. త్రిపురలో జరిగిన హింసాకాండపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ ను కోరారు టీఎంసీ నేతలే. త్రిపుర ఘటనపై సోమవారం ఉదయం ఢిల్లీలో ధర్నాకు టీఎంసీ రెడీ అయింది. ఇక, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ టీఎంసీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు సోమవారం త్రిపురకు వెళ్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

ALSO READ Singapore-India Flights : భారతీయ పర్యాటకులకు గుడ్ న్యూస్..క్వారంటైన్ ఫ్రీ ట్రావెల్ అనుమతించిన సింగపూర్