MP Derek O’Brien : పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి మరో ఎంపీ సస్పెండ్

పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి మరో ఎంపీ సస్పెండ్ అయ్యారు. సభలో క్రమశిక్షణ ఉల్లంఘించాడని పేర్కొంటూ టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్​ ను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో

MP Derek O’Brien : పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి మరో ఎంపీ సస్పెండ్

Mp7

MP Derek O’Brien : పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి మరో ఎంపీ సస్పెండ్ అయ్యారు. సభలో క్రమశిక్షణ ఉల్లంఘించాడని పేర్కొంటూ టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్​ ను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేశారు.

మంగళవారం రాజ్యసభలో ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు 2021పై చర్చ జరుగుతున్న సమయంలో ఎంపీ డెరెక్ ఓబ్రియన్ రాజ్యసభ రూల్​బుక్​ను ఛైర్మన్ చైర్ వైపు విసిరేశారు. దీంతో సభ నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయన్ను ప్రస్తుత సెషన్​లోని మిగతా సమావేశాలకు హాజరు కాకుండా చైర్మన్ నిషేధం విధించారు.

కాగా,నవంబర్ 29న రాజ్యసభలోని 12మంది విపక్ష ఎంపీలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనకుండా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నిషేధం విధించిన విషయం తెలిసిందే. గత పార్లమెంట్ సమావేశాల్లో వీరు ప్రవర్తించిన తీరు అభ్యంరకమని పేర్కొంటూ ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. అయితే శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ అంశంపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ..ఎంపీల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న సమయంలో టీఎంసీ ఎంపీ సస్పెషన్ ఇప్పుడు కీలకంగా మారింది.

ALSO READ Tokenization : కార్డులు లేకుండానే..ఆన్ లైన్ షాపింగ్, ‘టోకనైజేషన్’ అంటే ఏమిటీ ? పూర్తి వివరాలు