Atiq Ahmed Murder: అతిక్ అహ్మద్‭పై కాల్పులు జరిపిన ముగ్గురిపై అనేక కేసులు.. తమకేమీ తెలియదంటున్న కుటుంబ సభ్యులు

ఈ ముగ్గురు ముష్కరులపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి. అరుణ్ ఒక హత్య కేసులో ప్రమేయం ఉన్నాడు. గత 5-6 సంవత్సరాలుగా తన కుటుంబంతో నివసించడం లేదని ఆరోపించారు. సన్నీపై సుమారు 14-15 కేసులు నమోదయ్యాయి. ఇక లవ్లేష్ మీద నాలుగు కేసులు ఉన్నాయి

Atiq Ahmed Murder: అతిక్ అహ్మద్‭పై కాల్పులు జరిపిన ముగ్గురిపై అనేక కేసులు.. తమకేమీ తెలియదంటున్న కుటుంబ సభ్యులు

atiq ahmed killers

Atiq Ahmed Murder: వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా.. ప్రయాగ్‌రాజ్‌లోని ఎంఎల్ఎన్ మెడికల్ కాలేజీ ఆవరణలోనే పోలీసులు, మీడియా మధ్యనే మాజీ ఎంపీ, గ్యాంగ్‭స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్‭ను కిరాతకంగా కాల్చి చంపారు. దొంగ మీడియా కార్డులతో డమ్మీ కెమెరాలు, మైకులతో మీడియా ప్రతినిధుల వేషంలో వచ్చిన లవ్లేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్య అనే ముగ్గురు దుండగులు మీడియాతో అతిక్ అహ్మద్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అతిక్ సహా అతడి సోదరుడు అక్కడే కుప్పకూలిపోయారు.

Atiq Ahmed: అతీక్ అహ్మద్ మామూలోడు కాదు.. ఈ ఫొటో చూడండి మీకే తెలుస్తుంది!

అయితే ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు? ఎందుకు అతిక్ అహ్మద్ మీద కాల్పులు జరిపారనే ప్రశ్నలు సహజంగానే పైకి లేస్తున్నాయి. ఫేమస్ అవ్వడం కోసమే అతిక్ అహ్మద్‭ను చంపినట్లు వాళ్లు చెప్పినప్పటికీ కారణాలు వేరే ఉన్నాయనే వాదనలు చాలా బలంగానే వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు ముష్కరులపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి. అరుణ్ ఒక హత్య కేసులో ప్రమేయం ఉన్నాడు. గత 5-6 సంవత్సరాలుగా తన కుటుంబంతో నివసించడం లేదని ఆరోపించారు. సన్నీపై సుమారు 14-15 కేసులు నమోదయ్యాయి. ఇక లవ్లేష్ మీద నాలుగు కేసులు ఉన్నాయి. అయితే వీరి ఆగడాల గురించి తమకేదీ తెలియదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

Karnataka Polls: మళ్లీ బీజేపీలోకి వస్తే.. షెట్టర్ రాజీనామాపై స్పందించిన యడియూరప్ప

బఘేలా పుఖ్తా గ్రామంలో నివాసి అయిన షూటర్ అరుణ్ తండ్రి పేరు హీరాలాల్. జీఆర్‭పీ స్టేషన్‌లో ఒక పోలీసు అధికారిని హత్య చేసిన తర్వాత అరుణ్ తన గ్రామం నుంచి పారిపోయాడు. అతని తల్లిదండ్రులు పదిహేనేళ్ల క్రితం చనిపోయారు. సన్నీ అలియాస్ షూటర్ షానీ సింగ్ హమీర్‌పూర్ జిల్లాలోని కురారా పట్టణ నివాసి. ఇతనిపై 15 కేసులు నమోదు కాగా గత ఐదేళ్లుగా పరారీలో ఉన్నాడు. ఇతడి తల్లిదండ్రులు కూడా చనిపోయారు. గతంలో ఓ కేసులో జైలుశిక్ష అనుభవించాడు. సన్నీ సింగ్‌కు ముగ్గురు సోదరులు ఉన్నారు, వారిలో ఒకరు చనిపోయారు. మరొక సోదరుడు పింటూ సింగ్ ఇంట్లో ఉంటూ టీ దుకాణం నడుపుతున్నాడు.

Atiq Ahmed: అతీక్ అహ్మద్ మామూలోడు కాదు.. ఈ ఫొటో చూడండి మీకే తెలుస్తుంది!

లవ్లేష్ తివారీ కొత్వాలి నగరంలోని క్యోత్రా ప్రాంతంలో నివాసి. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, అప్పుడప్పుడే ఇంటికి వచ్చేవాడని అతడి తండ్రి యజ్ఞ తివారీ చెప్పాడు. అతను 5, 6 రోజుల క్రితం బండకు వచ్చాడట. లవ్లేష్ ఉద్యోగం లేనివాడని, డ్రగ్స్‭కు బానిసని తండ్రి చెప్పాడు. ‘‘అతను పని చేయడు. డ్రగ్స్ బానిస. మాకు నలుగురు పిల్లలు ఉన్నారు. దీని గురించి మేము ఏమీ చెప్పలేము’’ అని యజ్ఞ తివారీ అన్నారు. లవ్లేష్ తివారీ తల్లి ఆదివారం తన కొడుకు పెద్ద భక్తుడని, తరుచూ దేవాలయాలకు వెళ్తాడని చెప్తూ భావోద్వేగానికి లోనైంది.

Atiq Ahmed Murder: అతిక్ అహ్మద్ పిల్లలందర్నీ చంపేస్తారేమో అంటున్న ఎస్పీ ఎంపీ రాంగోపాల్

ఈ హత్యలలో తన సోదరుడి ప్రమేయం గురించి తనకు తెలియదని షూటర్లలో ఒకరైన సన్నీ సింగ్ సోదరుడు మీడియాతో చెప్పాడు. సన్నీ సోదరుడు పింటూ మాట్లాడుతూ “నా సోదరుడిపై కేసులు నమోదయ్యాయి. బతుకుదెరువు కోసం ఏ పనీ చేయలేదు. అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యలో నా సోదరుడి ప్రమేయం ఉందని నాకు తెలియదు’’ అని అన్నారు.