Triple Mutation Covid: భారత్కు మరో సవాల్: కరోనా మూడో అవతారం
భారత్ లో కరోనా కోరలు చాచింది. ప్రతి రోజు మూడు లక్షలకు చేరువలో కొత్తకేసులు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఒకటి.. రెండు అవతారాల్లో కరోనా విజృభించగా మూడో అవతారం ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Triple Mutation Covid
Triple Mutation Covid: భారత్ లో కరోనా కోరలు చాచింది. ప్రతి రోజు మూడు లక్షలకు చేరువలో కొత్తకేసులు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఒకటి.. రెండు అవతారాల్లో కరోనా విజృభించగా మూడో అవతారం ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది భయానకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ట్రిపుల్ మ్యూటెంట్ కేసులో దేశంలో నమోదవుతున్నాయని గుర్తించారు. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ ఈ మూడో అవతారం బయటపడటం ఆందోళన కలిగిస్తుంది.
ట్రిపుల్ మ్యూటెంట్ అంటే వైరస్ మూడుసార్లు జన్యు మార్పిడికి లోనవడం. ఈ రకమైన కేసులను మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో గుర్తించారు శాస్త్రవేత్తలు. మొదట ఈ వైరస్ బెంగాల్లో గుర్తించినట్టుగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ శాస్త్రవేత్త వినోద్ స్కారియా తెలిపారు.
ఈ ట్రిపుల్ వేరియెంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. దేశంలో ఇది విస్తరిస్తే దీని భారిన పడేవారి సంఖ్య భారీగా ఉంటుందని చెబుతున్నారు మెక్గిల్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మధుకర్ పాయ్. ట్రిపుల్ మ్యూటెంట్ కేసుల్ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే తప్ప ఎంత హానికరమో చెప్పలేమని నిపుణులు అంటున్నారు.