Triple Mutation Variant: ట్రిపుల్ మ్యుటేషన్ వేరియంట్.. కొవిడ్ మహమ్మారి విసురుతున్న మరో ఛాలెంజ్

ప్రస్తుతానికి వైరస్ జెనోమ్ ను స్టడీ చేయడానికి 10 ల్యాబ్ లు మాత్రమే ఉన్నాయి. డబుల్ మ్యుటెంట్ చిన్నపిల్లల్లో...

Triple Mutation Variant: ట్రిపుల్ మ్యుటేషన్ వేరియంట్.. కొవిడ్ మహమ్మారి విసురుతున్న మరో ఛాలెంజ్

Third Mutanat (1)

Triple Mutation Variant: ఇండియా రిపోర్టుల ప్రకారం.. మూడు లక్షల కంటే ఎక్కువ కేసులు, 2వేలకు పైగా మరణాలు.. ఇదంతా 24గంటల్లోనే. మహమ్మారి విజృంభించిన తర్వాత మరో కొత్త మ్యుటేషన్ వచ్చి నయా ఛాలెంజ్ విసిరింది. అంటే దీంతో కలిపి మూడు రకాల కొవిడ్ స్ట్రెయిన్లు కలిసి కొత్త వేరియంట్ గా మారిందదని అంటున్నారు.



మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ లలో ట్రిపుట్ మ్యుటెంట్ కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు కనిపిస్తూనే ఉన్నాయని సైంటిస్టులు అంటున్నారు.

ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దాంతోపాటు వెంటనే అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుందని మెక్ గిల్ యూనివర్సిటీ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ మధుకర్ పై అంటున్నారు. మనం వ్యాక్సిన్లు ఇంప్రూవ్ చేసుకోవాలి. దాని కంటే ముందు జబ్బు ఏంటో తెలుసుకోవాలి. కొవిడ్ యుద్ధంలో ఆల్రెడీ అడుగుపెట్టేశాం.

ఇది ఇండియాకే పెను ఛాలెంజ్ గా మారింది. కేసులన్నింటిలోనూ జెనోమ్ సీక్వెన్సింగ్ ఎందుకు జరుగుతుందని డా. పై పరిశోధనలు జరుపుతున్నారు.



ట్రిపుల్ మ్యూటేషన్ అంటే..
రెండు కరోనా స్ట్రెయిన్స్ కలిపితే తయారైందే డబుల్ మ్యూటేషన్. ఇప్పుడు మూడు కొవిడ్ వేరియంట్లు కలిస్తే వచ్చినదానిని ట్రిపుల్ మ్యూటేషన్ అంటారు. ఇది మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఢిల్లీలలో కనిపించింది.

ఈ మ్యూటేషన్స్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పెంచుతున్నాయి. ప్రస్తుతానికి వైరస్ జెనోమ్ ను స్టడీ చేయడానికి 10 ల్యాబ్ లు మాత్రమే ఉన్నాయి. డబుల్ మ్యుటెంట్ చిన్నపిల్లల్లో వ్యాప్తికి కూడా కారణమవుతుండగా, ట్రిపుల్ మ్యూటేషన్ అంతకుమించి వేగంగా వ్యాపిస్తుంది.