Triple Talaq : లావుగా ఉన్న భార్య వద్దంటూ తలాక్ చెప్పిన భర్త

లావుగా ఉన్న భార్య వద్దంటూ తలాక్ చెప్పాడు భర్త. బాడీ షేమింగ్ చేస్తుంటే భరించింది. కానీ ఏకంగా విడాకులు ఇచ్చాను ఇంటినుంచి గెంటేస్తే ఎలా అంటూ పోలీసులకు మొరపెట్టుకుందా బాధితురాలు.

Triple Talaq : లావుగా ఉన్న భార్య వద్దంటూ తలాక్ చెప్పిన భర్త

man throws wife out of house, files for divorce as she gains weight after marriage

Triple Talaq : వివాహం అయి ఒకరు ఇద్దరు బిడ్డలు పుట్టాక మహిళలు లావు అవ్వటం సర్వసాధారణం. ఆమాటకొస్తే మగవారు లావు అవ్వరు..పొట్ట రాదు అని గ్యారంటీ లేదు. ఇలా బరువు పెరగటం అనేది వారి వారి జీవనశైలి కావచ్చు..లేదా ఆరోగ్యకారణాలు కావచ్చు. ఇదంతా ఎందుకు అంటే ఓ భర్త భార్య లావుగా అయ్యిందని విడాకులు ఇచ్చాడు. బాడీ షేమింగ్ అనేది దంపతుల విడాకులకు కారణం అవ్వటం అంటే దారుణమనే చెప్పాలి. అదే జరిగింది ఉత్తరప్రదేశ్‌ మీరట్​లో.

పెండ్లి త‌ర్వాత బ‌రువు పెరిగినందుకు భ‌ర్త త‌నను ఇంట్లోంచి గెంటివేసి తలాక్ చెప్పాడని వాపోయింది ఓ మహిళ. త‌న‌కు న్యాయం చేయాల‌ని న‌జ్మా అనే బాధితురాలు లిసాడిగేట్ పోలీస్ స్టేష‌న్‌ను ఆశ్ర‌యించింది. తాను లావ‌య్యాన‌ని అంటూ నెల కింద‌ట భ‌ర్త స‌ల్మాన్ త‌న‌ను ఇంటి నుంచి గెంటేశాడ‌ని..ఇప్పుడు విడాకులు ఇచ్చేశాను ఇక నీకూ నాకు సంబంధం లేదంటూ మూడు సార్లు తలాక్ చెప్పాడని వాపోయింది.

న‌జ్మాను త‌ర‌చూ భ‌ర్త బాడీ షేమింగ్ చేస్తుండ‌టంతో ఏడేండ్ల కొడుకు ఎదుటే ఇద్ద‌రూ త‌ర‌చూ గొడవపడేవాడు. అలా ఇంత లావు అయిపోయావు..నువ్వు నా భార్యవు అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది ఇకనీతో కలిసి ఉండలేను వెళ్లిపొమ్మన్నాడు. భర్త మాటలు విన్న నజ్మా షాక్ అయ్యింది. బాడీ షేమింగ్ చేస్తుంటే భరించింది. కానీ ఏకంగా విడాకులు ఇచ్చాను ఇంటినుంచి గెంటేస్తే ఎలా అంటూ పోలీసులకు మొరపెట్టుకుంది.

నేను నా భర్త స‌ల్మాన్‌తో క‌లిసి నివ‌సించాల‌ని కోరుకుంటున్నా ఆయ‌న విడాకులు కోరుతున్నాడ‌ని న‌జ్మా కన్నీటితో చెప్పింది. ఎన్నో సార్లు భ‌ర్త‌కు స‌ర్ధిచెప్పినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. “ట్రిపుల్ తలాక్ కోసం నా భర్త విడాకుల నోటీసులు పంపాడు. నోటీసులు అందగానే భర్తతో మాట్లాడాను. కానీ ఫలితం లేదు. నువ్వు లావుగా అయ్యావు..నీలాంటి భార్య నాకు వద్దు అంటూ దారుణంగా అవమానించి విడాకులు ఇస్తున్నానని తెలిపాడు. నాకు పోలీసులే న్యాయం చేయాలి. నాకు ఎనిమిదేళ్ల క్రితం సల్మాన్​తో వివాహమైంది. 7 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. నెల క్రితం భర్త సల్మాన్ నన్ను ఇంటి నుంచి గెంటేశాడు.అంటూ నజ్మా కన్నీటితో వేడుకుంటోంది. కానీ పోలీసులు మాత్రం తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఓ అరవింత్ చౌరాసియా అంటున్నారు. అటువంటి కేసు వస్తే తప్పకుండా దర్యాప్తు చేస్తామని చెబుతున్నారు.