Saayoni Ghosh : తృణముల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి బెయిల్
బీజేపీ నేతలపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సాయోని ఘోష్‌కి బెయిల్ లభించింది.

Gosh (1)
Saayoni Ghosh : బీజేపీ నేతలపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సాయోని ఘోష్‌కి బెయిల్ లభించింది. ఇవాళ ఆమెను పశ్చిమ త్రిపురలోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్…20వేల రూపాయల పూచీకత్తుతో సాయోని ఘోష్‌కి కండీషనల్ బెయిల్ మంజూరు చేసింది.
కాగా, శనివారం అగర్తలాలో త్రిపర్ సీఎం బిప్లబ్ దేబ్ హాజరైన ఓ రాజకీయ కార్యక్రమాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ సాయోని ఘోష్‌ను ఆదివారం త్రిపుర పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెపై హత్యా ప్రయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాస్తవానికి దీనికి ముందు బీజేపీ కార్యకర్తలే తమపై దాడికి పాల్పడ్డారని టీఎంసీ కార్యకర్తలు ఆరోపించారు. పోలీసుల ఎదుటే తమపై కర్రలతో దాడి చేశారని, రాళ్లు విసిరారని పేర్కొన్నారు.
కాగా, ఆదివారం సాయాని ఘోష్ బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ఆమెను పిలిచారని, అయితే అందుకు కారణాన్ని మాత్రం వెల్లడించలేదని టీఎంసీ పేర్కొంది. పోలీసులు పిలవడంతో సాయోని ఘోష్, కునాల్ ఘోష్ తదితర టీఎంసీ నేతలు అగర్తల ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారని.. ఆమె ఇంటరాగేషన్ కోసం లోపలికి వెళ్లిన తర్వాత హెల్మెట్లు ధరించిన 25 మంది బీజేపీ కార్యకర్తలు చేతుల్లో కర్రలతో అక్కడికి చేరుకుని తమపై కార్యకర్తలపై దాడిచేసినట్టు టీఎంసీ ఆరోపించింది. పోలీస్ స్టేషన్ వద్ద వారి సమక్షంలోనే తమపై కర్రలతో దాడిచేశారని, రాళ్లు విసిరారని పేర్కొన్నారు. ఈ హింసాకాండలో ఆరుగురు తృణమూల్ మద్దతుదారులు గాయపడ్డారని టీఎంసీ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ట్విట్టర్ లో షేర్ చేశారు.
త్రిపుర పోలీసులు తనపై హత్యాయత్నం కేసు మోపడాన్ని సయోని ఘోష్ ఖండించారు. బీజేపీ సమావేశం జరిగే చోట కారులో వెళ్తున్న వీడియోను ఆమె ట్వీట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లే వరకు తనపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తనకే తెలియలేదని ఘోష్ చెప్పారు
ఇక, త్రిపుర ఘటనపై ఇవాళ పలువురు టీఎంసీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షాతో సమావేశం అనంతరం టిఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ..”మా నాయకులను ఎలా అరెస్టు చేశారో , ఎంపీలను ఎలా కొట్టారో మేము ఆయనకు (అమిత్ షా) వివరంగా చెప్పాము. తాను నిన్న త్రిపుర సిఎంతో ఫోన్‌లో మాట్లాడానని, రాష్ట్రం నుండి నివేదిక కోరతానని అమిత్ షా చెప్పారు” అని కళ్యాణ్ బెనర్జీ చెప్పారు.
ALSO READ Bengal : ఆటోలో ఉచితంగా జర్నీ చేయవచ్చు..కానీ డ్రైవర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి