Tripura : త్రిపురలో డెల్టా వేరియంట్ కలకలం, 138 కేసులు

త్రిపుర రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు అధికంగా వెలుగు చూడడం అందర్నీ కలవరపెడుతోంది. 151 శాంపిల్స్ ను జీనోమ్ స్వీకెన్సింగ్ కు పంపగా..138 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్ గా తేలాయని రాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి డా.దీప్ కుమార్ దెబ్బర్మా వెల్లడించారు.

Tripura : త్రిపురలో డెల్టా వేరియంట్ కలకలం, 138 కేసులు

Tripura

Tripura Delta : ఓ వైపు కరోనా ఇంకా భయపెడుతుంటే..డెల్టా రూపంలో మరో ప్రమాదం వచ్చి పడింది. డెల్టా కేసులు పలు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్నాయి. త్రిపుర రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు అధికంగా వెలుగు చూడడం అందర్నీ కలవరపెడుతోంది. 151 శాంపిల్స్ ను జీనోమ్ స్వీకెన్సింగ్ కు పంపగా..138 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్ గా తేలాయని రాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి డా.దీప్ కుమార్ దెబ్బర్మా వెల్లడించారు. బెంగాల్ లోని కళ్యాణిలో లేబరేటరీకి పరీక్షల కోసం శాంపిల్స్ పంపామని, మొత్తం 151 కేసులకు గాను..138 డెల్టా వేరియంట్ ప్లస్ కేసులుగా గుర్తించామన్నారు.

Read More : Palanpur Seed Bank : అంతరించే మొక్కల్ని కాపాడుతున్న యువ టీచర్..ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ గుర్తింపు 

ఇందులో మూడు కేసులు అల్ఫా వేరియంట్, 10 కేసులు డెల్టా వేరియంట్ గా గుర్తించామన్నారు. ఈ క్రమంలో.. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంట వరకు వారాంతపు లాక్‌డౌన్‌ను విధించింది. నైట్‌ కర్ఫ్యూను జులై 17 వరకు పొడిగించింది. రాజధాని అగర్తలా మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు.