TRS Support : రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం..ఆయనకే గులాబీ మద్దతు!
బీజేపీయేతర అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు కేసీఆర్ ఒకే చెప్పారు. మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హాకు గులాబీ పార్టీ మద్దతు ప్రకటించింది. సీఎం కేసీఆర్ తో ఫోన్ లో శరద్ పవార్ మాట్లాడారు. కేసీఆర్...యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించారని శరద్ పవార్ చెప్పారు.

TRS support : రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురు టిఆర్ఎస్ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. బీజేపీయేతర అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు కేసీఆర్ ఒకే చెప్పారు. మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హాకు గులాబీ పార్టీ మద్దతు ప్రకటించింది. సీఎం కేసీఆర్ తో ఫోన్ లో శరద్ పవార్ మాట్లాడారు. కేసీఆర్…యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించారని శరద్ పవార్ చెప్పారు. అయితే, టీఆర్ఎస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బీజేపీ, కాంగ్రెస్ కు సమదూరం యశ్వంత్ సిన్హా పాటిస్తున్నారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ కు సమదూరం పాటించామన్న మెసేజ్ ప్రజలకు పంపే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్లో సమావేశమైన 18 ప్రతిపక్షాల పార్టీల నాయకులు యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. విపక్షాల నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. అన్ని పార్టీలు తనకు మద్దతు ఇవ్వాలని యశ్వంత్ సిన్హా విజ్ఞప్తి చేశారు. యశ్వంత్ సిన్హా గతంలో కేంద్ర ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం తృణమూల్ పార్టీలో కొనసాగుతున్న యశ్వంత్ సిన్హా.. ఇవాళ ఉదయం ఆ పార్టీకి రాజీనామా చేశారు.
Venkaiah Naidu: వెంకయ్య దారెటు? రాష్ట్రపతి అభ్యర్థా..? ఉప రాష్ట్రపతిగా కొనసాగింపా?
విపక్ష పార్టీల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరో వైపు ఇవాళ అధికార బీజేపీ పార్టీ కూడా తమ అభ్యర్థిని తేల్చనుంది. పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌కు ప్రధాని మోదీ వర్చువల్‌గా హాజరుకానున్నారు. జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.
యశ్వంత్ సిన్హా 1960లో ఐఏఎస్ ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత 24 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా కొనసాగారు. 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం జనతా పార్టీలో చేరారు. 1988లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 1996లో బీజేపీ అధికార ప్రతినిధిగా పని చేశారు. 1998, 1999, 2009లో హజారీబాగ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 1998లో చంద్రశేఖర్ కేబినెట్లో ఏడాది పాటు కేంద్ర ఆర్థిక మంత్రిగా కొనసాగారు. 2002లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. 2021, మార్చి 13న తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మార్చి 15న టీఎంసీ వైస్ ప్రెసిడెంట్‌గా యశ్వంత్ సిన్హా ఎన్నుకున్నారు.
- Kishan Reddy : కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదు : కిషన్ రెడ్డి
- Yashwant Sinha : కేసీఆర్, ఎంఐఎం నేతలతో సమావేశం కానున్న యశ్వంత్ సిన్హా
- Yashwanth Sinha: యశ్వంత్ సిన్హా పర్యటనకు కాంగ్రెస్ దూరం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
- Yashwant Sinha: నాడు అలా.. నేడు ఇలా.. హైదరాబాద్‌లో అడుగిడనున్న యశ్వంత్ సిన్హా
- Yashwant Sinha: నేడు హైదరాబాద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. ఘనస్వాగతం పలకనున్న టీఆర్ఎస్
1MS Dhoni : ఎంఎస్ ధోనీకి ఏమైంది. రూ.40లతో నాటు వైద్యం..!
2Salaar: యాక్షన్‌తోనే క్లూ ఇస్తోన్న సలార్.. మీకు అర్థమవుతోందా..?
3Prophet Comment Row : అమరావతి కెమిస్ట్ హత్య కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు-హోం మంత్రి అమిత్ షా
4PM Modi : హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని
5Jamun Fruits : మెదడు, గుండెకు ఔషధంగా పనిచేసే నేరేడు పండ్లు!
6Pawan Kalyan: మెగా కాంబో మూవీ షురూ అయ్యేది అప్పుడే..!
7Vasundhara Raje: ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చే అంశంపై చర్చించాం: వసుంధరా రాజే
8Nupur Sharma: నుపుర్ శర్మకు సపోర్ట్ చేసి హత్యకు గురైన మరో వ్యక్తి
9BVR School : హైదరాబాద్ ఐఐటీలో బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ పార్క్
10Increase Memory : జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరగాలంటే?
-
Anasuya: మధురవాణిగా మారుతున్న దాక్షాయణి..?
-
Ear Infection : చెవి ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారా! వెల్లుల్లితో..
-
Ram Charan: నయా లుక్‌లో చరణ్ రచ్చ..!
-
RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
-
Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
-
Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
-
Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
-
Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!