హెల్మెట్ లేదని లారీ డ్రైవర్‌కు జరిమానా

  • Edited By: chvmurthy , November 6, 2019 / 06:14 AM IST
హెల్మెట్ లేదని లారీ డ్రైవర్‌కు జరిమానా

బైక్ పై హెల్మెట్ లేకుండా వెళ్తున్న టైమ్ లో రోడ్డుమీద ట్రాఫిక్ పోలీసు ఆపి హెల్మెట్ లేనందుకు జరిమానా విధిస్తే దానిగురించి చెప్పుకోవల్సింది ఏమీ లేదు..అది సాధారణ విషయం కాబట్టి. కానీ కర్ణాటక పోలీసులు లారీ డ్రయివర్ హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా విధించారు

ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు విధించిన జరిమానా డ్రైవర్  సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో అదికాస్త వైరల్ అయ్యింది. కార్వార సమీపంలోని దాండేలి నగరంలో 409 వాహన డ్రైవర్‌గా పని చేస్తున్న నజీర్‌ ఇంటికి పోలీసులు నోటీసు పంపారు. హెల్మెట్‌ ధరించ లేదని 500 రూపాయలకు రశీదు రాసి, జరిమానా చెల్లించాలని నోటీసు పంపారు.

కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తీసుకువచ్చిన కొత్త మోటారు వెహికల్ యాక్ట్ అమల్లోకి వచ్చాక దానిపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కన్నడ పోలీసులు చేసిన పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. నోటీసుపై దాండేలి రూరల్ పోలీసు స్టేషన్ ఏఎస్సై సంతకం చేసి పంపించారు.