Updated On - 7:56 pm, Sun, 22 November 20
Tunnel detected in J&K’s Samba జమ్ముకశ్మీర్‌లో సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సొరంగ మార్గాలను కనుగొనేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. శుక్రవారం నుంచి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఆపరేషన్ సాగింది. ఇతర భద్రతా దళాలు, పోలీసులు కూడా వీరికి సహకరించారు.
ఈ క్రమంలో సాంబా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 150 మీటర్ల పొడవున్న ఓ టన్నెల్ ను గుర్తించినట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ సింగ్ తెలిపారు. కాగా, నవంబర్ 19న గ్రోటా ఎన్కౌంటర్లో హతమైన నలుగురు జైషే ముష్కరులు ఈ టన్నెల్ గుండానే భారత్‌లోకి చొరబడినట్లు అధికారులు భావిస్తున్నారు.
కాగా, జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటాలో గురువారం భీకర ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. బాన్ టోల్‌ప్లాజా సమీపంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో నవంబర్ 19న భద్రతాదళాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు జైషే ఉగ్రవాదులు నలుగురు హతం అయ్యారు. వారి వద్ద 11 ఏకే అసాల్ట్ రైఫిళ్లు, 3 పిస్టోళ్లు, 29 గ్రెనేడ్లు సహా భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 28న జమ్ముకశ్మీర్‌లో 8 విడతల్లో జరగనున్న స్థానిక ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఉగ్రవాదులు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు.
నగ్రోటా ఘటనలో అధికారుల పనితీరుపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనపై శుక్రవారం(నవంబర్-20,2020)ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించారు. జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న స్థానిక ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను సైనిక దళాలు నిలువరించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. పాకిస్తాన్ ప్రధానకేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులను మనవాళ్లు మట్టుబెట్టారని, ఉగ్రవాదుల నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నామని, దీంతో భారీ విధ్వంసాన్ని తప్పించారని మోడీ తెలిపారు.
మరోవైపు, ఉగ్రవాదులను గుర్తించేందుకు ఫుల్ బాడీ ట్రక్ స్కానర్లు కావాలని భద్రతా దళాలు కోరుతున్నాయి. ముష్కరులు ఎక్కువగా ట్రక్కుల్లో దాక్కొనే.. కశ్మీర్ గుండా రాష్ట్రాలు దాటుతున్న నేపథ్యంలో వేర్వేరు చెక్‌పోస్టుల వద్ద వీటిని అమర్చాల్సిన అవసరాన్నిఅధికారులు నొక్కిచెబుతున్నారు.
బాలీవుడ్ మూవీ క్లిప్ షేర్ చేసిన పాక్ ప్రధాని..నెటిజన్ల ట్రోలింగ్ తో డిలీట్
కరోనా కట్టడి కోసం రంగంలోకి ఆర్మీ
T20 World Cup: హైదరాబాద్‌కు చోటు.. పాకిస్తాన్ మ్యాచ్‌లు ఢిల్లీలో.. ఫైనల్ మోడీ స్టేడియంలో!
NIA : సైన్యం సమాచారాన్ని పాకిస్థాన్ చేరవేసిన అన్నదమ్ములు
Pakistan Visa to Indians : వైశాఖి పర్వదినం..1100 మంది భారతీయులకు వీసాలు జారీ చేసిన పాకిస్థాన్
Chenab Rail Bridge : ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్.. కీలక ఘట్టం పూర్తి