ఇంట్లోకి చొరబడి తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం..ట్యూటర్ అరెస్టు

  • Published By: bheemraj ,Published On : August 11, 2020 / 08:40 PM IST
ఇంట్లోకి చొరబడి తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం..ట్యూటర్ అరెస్టు

చత్తీష్‌గడ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో ఓ ఇంట్లోకి చొరబడి తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అర్షద్‌ రెహ్మానీ(27) అనే వ్యక్తి మదర్సా అనే విద్యా సంస్థలో ఉపాద్యాయుడిగా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో బాధిత బాలిక సోదరికి అరబిక్‌ నేర్పడించడానికి ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆదివారం బాలిక ఇంట్లోకి వెళ్లి ఆమెపై లైంగిక దాడి చేసి పరారయ్యాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం అతన్ని అరెస్టు చేశారు.

ఖమర్థిన్‌ పోలీసు స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ మమతా శర్మ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు బాలిక సోదరికి అరబిక్‌ నేర్పించేందుకు బాధితురాలి ఇంటికి రోజు వెళ్లేవాడని, ఈ క్రమంలో ఆదివారం బాధిత బాలికపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడి పారిపోయినట్లు వెల్లడించారు. నిందితునిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 376 (అత్యాచారం), 506 (క్రిమినల్ బెదిరింపు) పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.