చైనాను చాటుగా దెబ్బతీసిన ఇండియన్ Tutu regiment రహస్యమేంటి?

  • Published By: madhu ,Published On : September 3, 2020 / 09:05 AM IST
చైనాను చాటుగా దెబ్బతీసిన ఇండియన్ Tutu regiment రహస్యమేంటి?

Secret Tutu regiment prepared to fight China: చైనా సైన్యంతో పోరాడేందుకు భారత్ టు టు రెజిమెంట్‌ను రంగంలోకి దించుతోంది. ఇంటెలిజెన్స్ రెజిమెంట్‌గా గుర్తింపు పొందిన ఈ దళం..సైన్యానికి బదులుగా RAW ద్వారా నేరుగా ప్రధానమంత్రికి నివేదిస్తుంది. చైనాతో యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఈ రెజిమెంట్ గురించి ప్రతి సమాచారం చాలా రహస్యం. బైటకు తెలియదు.



ఈ రెజిమెంట్ ఇప్పటికీ చాలా సీక్రెట్. ఆ రెజిమెంట్ లో ఎవరుంటారో? ఎలా పోరాడతారో ఎవరికీ తెలియదు. టుటు రెజిమెంట్ 1962 సంవత్సరంలో ఎర్పాటుచేశారు. ఉద్దేశం? చైనా సరిహద్దులోకి వెళ్లి లద్దాఖ్‌ క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులలో పోరాడగల యోధులను సిద్ధం చేయడం. రాళ్లల్లో పహారా, పర్వతాలు అధిరోహించడం, పరిగెత్తుకుంటూ వెళ్లాలి. అందుకే టిబెటన్ యువకులతో టుటు రెజిమెంట్‌ను ఎర్పాటుచేశారు. సరిహద్ధు పర్వతాలను చైనా కంటే ముందుగా ఆక్రమించడానికి ఈ సీక్రెట్ రెజిమెంట్ బరిలోకి దిగింది. చైనాను తొలిదెబ్బతీసింది.

మరోవైపు…ఎల్ఏసీ వ‌ద్ద టెన్షన్ వాతావ‌ర‌ణం. భ‌ద్రతా ద‌ళాలు అప్రమ‌త్తంగా ఉండాలంటూ కేంద్ర హోం శాఖ‌ ఆదేశాలు జారీ చేసింది. ఇండో-చైనా బోర్డర్‌తో పాటు, ఇండియా-నేపాల్‌, ఇండో-భూటాన్ స‌రిహ‌ద్దుల్లో బ‌ల‌గాలు అన్నీ అల‌ర్ట్. చైనాతో స‌రిహ‌ద్దు ఉన్న ప్రాంతాల్లో మ‌రింత గ‌స్తీని పెంచారు


ఉత్తరాఖండ్‌, అరుణాచ‌ల్ ప్రదేశ్‌, హిమాచ‌ల్ ప్రదేశ్‌, ల‌ద్దాఖ్‌, సిక్కిం స‌రిహ‌ద్దుల్లో భద్రతాబలగాలూ యుద్ధసన్నిద్ధం. ఉత్తరాఖండ్‌లోని కాలాపాని జంక్షన్ వ‌ద్ద గ‌స్తీ ముమ్మరంగా నిర్వహించే బాధ్యత ఎస్ఎస్‌బీ, ఐటీబీపీల‌కు అప్పగించారు. ఇండో నేపాల్ స‌రిహ‌ద్దుకు ఎస్ఎస్బీ అద‌న‌పు బ‌ల‌గాల‌ను పంపించారు. ఈస్ట్రన్ ల‌ద్దాఖ్‌లోని పాన్‌గాంగ్ వ‌ద్ద ఉన్న కీల‌క స్థావ‌రాల‌కు భార‌త్ ఆయుధాల‌ను త‌ర‌లించింది.

చైనాతో ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వెంబడి భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. జూన్ నుంచి తూర్పు లద్దాఖ్‌లో చైనా ఆగడాలు మితిమీరుతుండటంతో భద్రతను పెంచింది. సమీప భవిష్యత్తులో యుద్ధం వచ్చే అవకాశాలు లేవని భారత ప్రభుత్వం, సైన్యం చెబుతున్నా, అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో  సైన్యం కదలికలు పెరిగాయి. గాల్వన్ లోయలో ఘర్షణలు జరిగినప్పటి నుంచి దళాల మోహరింపు మరింత పెరిగింది.

అరుణాచల్ ప్రదేశ్‌ను వివాదం చేయడం చైనా వ్యూహం. దీన్ని దక్షిణ టిబెట్ అని అంటోంది. 1962లో దీనికోసమే యుద్దం. తాజా పరిస్థితులు మళ్ళీ యుద్ధానికి కారణం కావచ్చని భద్రతా విశ్లేషకులు భావిస్తున్నారు.