Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్‌కు సపోర్ట్‌గా ట్వీట్ చేస్తే పోస్ట్‌కు రూ.2 అనేది ఫేక్!

ఉత్తరప్రదేశ్ బీజేపీ లీడర్.. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కు తన భర్త అరెస్టుపై అక్రమం జరిగిందంటూ పోస్టు చేశారు. యోగి ఆదిత్యనాథ్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తే పోస్టుకు రూ.2 ఇస్తారనే ఆడియో క్లిప్ ఫేక్ అని అందులో వెల్లడించింది.

Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్‌కు సపోర్ట్‌గా ట్వీట్ చేస్తే పోస్ట్‌కు రూ.2 అనేది ఫేక్!

Yogi Adityanath

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ బీజేపీ లీడర్.. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కు తన భర్త అరెస్టుపై అక్రమం జరిగిందంటూ పోస్టు చేశారు. యోగి ఆదిత్యనాథ్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తే పోస్టుకు రూ.2 ఇస్తారనే ఆడియో క్లిప్ ఫేక్ అని అందులో వెల్లడించింది.

‘నా భర్త ఆశిష్ పాండే, యోగి ఆదిత్యానాథ్ అంటే నాలుగేళ్లుగా గౌరవప్రదంగా భావిస్తున్నారు. ఇది తప్పకుండా గౌరవం, భక్తి, విధేయతను ప్రశ్నించే పరీక్షే. నన్ను నా భర్తతో మీట్ అయ్యేందుకు పర్మిషన్ ఇప్పించండి. నా భర్త తరపున అసలు విషయాన్ని బయటపెడతాను’ అని డా.ప్రీతి, రాష్ట్ర బీజేపీ ఎన్జీఓ వింగ్ కో-కోఆర్డినేటర్ హిందీలో ట్వీట్ చేసి వెల్లడించారు.

హిమాన్షు సైనీ అనే వ్యక్తితో కలిపి పాండేను ఆదివారమే పోలీసులు అరెస్టు చేశారు. ఫోర్జరీ, చీటింగ్ లాంటి కేసుల్లో అతణ్ని అరెస్టు చేసినట్లు వారు వెల్లడించారు. సోషల్ మీడియా మేనేజ్మెంట్ కు సంబంధించిన కంపెనీతో కలిసి పాండే పనిచేస్తున్నాడని పోలీసులు అంటున్నారు.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఆ టీం హ్యాండిల్స్‌ రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ మినిష్టర్ ఆఫీస్ (సీఎంఓ) ఆధ్వర్యంలో నడిచింది. ఈ అరెస్టులపై సీఎంఓ లేదా రాష్ట్ర గవర్నమెంట్ ఎటువంటి కామెంట్ చేయలేదు.

ఫిర్యాదుదారు అయిన అతుక్ కుష్వాహ.. పాండే అనే వ్యక్తి పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల సోషల్ మీడియా హ్యాండిల్స్ ను మెయింటైన్ చేస్తున్నారు. ప్రస్తుతం మే30 నుంచి వైరల్ గా మారిన ఆడియో క్లిప్ భంగపరచడానికి మాత్రమే అన్నట్లుగా ఉందని అన్నారు.

నిమిషం పది సెకన్ల పాటు ఉన్న ఆడియోలో పేర్లు తెలియకుండా ట్వీట్ కు రూ.2 ఇస్తామంటూ మెసేజ్ లు పెడుతున్నారు. ఈ ఆడియో క్లిప్ ను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సూర్య ప్రతాప్ సింగ్ షేర్ చేశారు.