#GandhiJayanti: గాంధీ పుట్టిన రోజున ‘గాడ్సే జిందాబాద్’ అంటూ నెటిజెన్ల ట్రెండింగ్

రైట్ వింగ్ గ్రూపులకు చెందిన కొంత మంది ఈ ట్రెండ్ చేస్తున్నారు. కాగా గాడ్సేని పొగుడుతున్న క్రమంలో గాంధీ హత్యను కొంత మంది బహిరంగంగానే సమర్ధిస్తుండడం విశేషం. వాస్తవానికి ప్రతి ఏడాది గాంధీ జయంతి, వర్ధంతుల రోజుల గాడ్సే ప్రస్తావనకు వస్తుంది. అయితే ఎప్పుడూ గాంధీ హంతకుడిగానే గాడ్సేపై చర్చ జరిగేది. కానీ కొంత కాలంగా గాడ్సేని పొగుడుతూ బహిరంగ చర్చలు జరుగుతున్నాయి

#GandhiJayanti: గాంధీ పుట్టిన రోజున ‘గాడ్సే జిందాబాద్’ అంటూ నెటిజెన్ల ట్రెండింగ్

Twitter bells Godse zindabad along with Gandhi jayanti

#GandhiJayanti: భారత జాతి పిత మహాత్మాగాంధీ జయంతి కావడంతో దేశ వ్యాప్తంగా ఈరోజు సంబరాలు కొనసాగుతున్నాయి. భాతర స్వాతంత్ర్యోద్యమ సంఘటనల్ని, దేశానికి గాంధీ చేసిన సూచనల్ని స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా, ఇలాంటి సమయంలో కొంత మంది ఆయన హంతకుడైన నాథూరాం గాడ్సేని ప్రస్తావిస్తున్నారు. ఆ ప్రస్తావన కూడా ఆయనను పొగుడుతూ ఉండడం గమనార్హం. ట్విట్టర్ ట్రెండింగ్‭లో ‘గాడ్సే జిందాబాద్’ అనే హ్యాష్‭ట్యాగ్ ప్రస్తుతం టాప్‭లో ఉంది. మొదటి స్థానంలో గాంధీ జయంతి హ్యాష్‭ట్యాగ్ ఉండగా.. రెండో స్థానంలో ఇది ఉంది.

రైట్ వింగ్ గ్రూపులకు చెందిన కొంత మంది ఈ ట్రెండ్ చేస్తున్నారు. కాగా గాడ్సేని పొగుడుతున్న క్రమంలో గాంధీ హత్యను కొంత మంది బహిరంగంగానే సమర్ధిస్తుండడం విశేషం. వాస్తవానికి ప్రతి ఏడాది గాంధీ జయంతి, వర్ధంతుల రోజుల గాడ్సే ప్రస్తావనకు వస్తుంది. అయితే ఎప్పుడూ గాంధీ హంతకుడిగానే గాడ్సేపై చర్చ జరిగేది. కానీ కొంత కాలంగా గాడ్సేని పొగుడుతూ బహిరంగ చర్చలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీలోని ఎంపీలు సహా అనేక మంది నేతలు పలు సందర్భాల్లో గాడ్సేని పొగిడారు. బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ అయితే గాడ్సేని దేశభక్తుడని మీడియా ముందే వ్యాఖ్యానించారు.

హిందూ ధర్మానికి గాడ్సే ప్రతీకని కొందరు, హీరో అంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఇక కొందరు గాంధీని గాడ్సే ఎందుకు చంపాల్సి వచ్చిందో అంటూ సంజాయిషీలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి గాంధీ హత్య అనంతరం నాటి నుంచి గాడ్సే అంటే గాంధీ హంతకుడిగానే ఎక్కువ ప్రచారం ఉండేది. కానీ కొద్ది సంవత్సరాలుగా గాడ్సే గురించి సానుకూల కోణంలో ప్రచారం జరుగుతుండడం విశేషం. ఇక ‘గాడ్సే జిందాబాద్’ ట్రెండింగ్‭ని వ్యతిరేకిస్తూ ‘గాడ్సే ముర్దాబాద్’ అనే ట్రెండ్ సైతం ట్విట్టర్‭లో నడుస్తోంది.

Mallikarjun Kharge: పార్టీని పటిష్టం చేసేందుకే అధ్యక్ష బరిలోకి.. శశిథరూర్ నా చిన్న తమ్ముడులాంటి వాడు..

ట్విట్టర్ ట్రెండింగ్‭లోని కొన్ని ట్వీట్లు