Twitter : ఐటీ రూల్స్ పాటించడంలో ట్విట్టర్ విఫలం..కేంద్రం

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తో వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

Twitter : ఐటీ రూల్స్ పాటించడంలో ట్విట్టర్ విఫలం..కేంద్రం

Twitter

Twitter సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తో వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కొత్త ఐటీ రూల్స్ పాటించడంలో ట్విట్టర్ విఫలమైందని కేంద్రప్రభుత్వం అఫిడవిట్ లో తెలిపింది. ఐటీ నిబంధనలు పాటించకపోవడం అంటే చట్టాన్ని ఉల్లంఘించడం కిందకు వస్తుందని,దీని ప్రకారం ట్విటర్ మధ్యవర్తిత్వ హోదా కోల్పోవాల్సి వచ్చిందని కేంద్రం తెలిపింది.

ఐటీ నిబంధనలను ట్విట్టర్ పాటించడం లేదని,కొత్త ఐటీ రూల్స్ ప్రకారం ట్విట్టర్ భారత్ లో వెంటనే ఓ గ్రీవెన్స్ అధికారిని నియమించాలని కోరుతూ న్యాయవాది అమిత్ ఆచార్య ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణలో భాగంగానే కేంద్రం సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది. నూతన ఐటీ చట్టం-2021 మార్గదర్శకాలు పాటించేందుకు, ప్రత్యేక అధికారులను నియమించేందుకు దేశంలోని అన్ని సోషల్ మీడియా సంస్థలకు మూడు నెలలు సమయం ఇచ్చామని కేంద్రం అఫిడవిట్ లో తెలిపింది.

కానీ ట్విట్టర్ నిర్దేశించిన సమయంలోగా చర్యలు తీసుకోలేకపోయిందని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు వివరించింది. ట్విట్టర్..తాత్కాలిక రెసిడెంట్ అధికారిని,తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని,తాత్కాలిక నోడల్ కాంటాక్ట్ అధికారిని నియమించిందని,వారు వైదొలగడంతో అమెరికాకు చెందిన వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించిన కేంద్రం తెలిపింది. భారతీయేతర వ్యక్తులను నియమించడం ఐటీ నిబంధనల ఉల్లంఘేనని కేంద్రం తన అఫిడవిట్ లో పేర్కొంది. మరోవైపు ట్విట్టర్ ఇప్పటికే తన అఫిడవిట్ దాఖలు చేసింది. గతవారం జరిగిన విచారణలో ట్విట్టర్… ప్రత్యేక అధికారి (గ్రీవెన్స్) నియామకం చివరిదశలో ఉందని న్యాయస్థానానికి తెలిపింది.