Twitter India : ట్విట్టర్ సంచలన నిర్ణయం..ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి బదిలీ

ప్రస్తుతం భారత్ లో అటు అధికార పక్షం,ఇటు విపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా దిగగ్జ సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశంలో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఓ డైరెక్టర్‌ను నియమించరాదని ట్విటర్ నిర్ణయించింది.

Twitter India : ట్విట్టర్ సంచలన నిర్ణయం..ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి బదిలీ

Manish

Twitter India ప్రస్తుతం భారత్ లో అటు అధికార పక్షం,ఇటు విపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశంలో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఓ డైరెక్టర్‌ను నియమించరాదని ట్విటర్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ట్విటర్‌ ఇండియా హెడ్ మనీష్‌ మహేశ్వరిపై బదిలీ వేటు వేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. మనీష్‌ మహేశ్వరి అమెరికాకు బదిలీ చేసింది. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్‌ నియమించనుంది. దీంతో మనీష్ మహేశ్వరి.. ట్విట్టర్ హెడ్​క్వార్టర్స్​ ఉన్న శాన్​ఫ్రాన్సిస్కోకు మకాం మార్చనున్నారు.

ట్విట్టర్ సంస్థ యొక్క జపాన్,దక్షిణ కొరియా,ఏసియా ఫసిఫిక్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న యు-సున్ శుక్రవారం ఓ ట్వీట్ లో..గడచిన రెండేళ్లకుపైగా మా భారతీయ వ్యాపారానికి నాయకత్వం వహించినందుకు మనీష్ మహేశ్వరికి ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా నూతన మార్కెట్ల కోసం అమెరికా కేంద్రంగా రెవిన్యూ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ ఇన్‌ఛార్జిగా మీరు కొత్త పాత్ర పోషించబోతున్నందుకు అభినందనలు. ట్విటర్‌కు ముఖ్యమైన అభివృద్ధి అవకాశానికి వహించడం చూడాలని ఆత్రుతగా ఉంది అని పేర్కొన్నారు.

ఇకపై ట్విటర్ ఇండియా కార్యకలాపాలు ‘లీడర్‌షిప్ కౌన్సిల్’ మార్గదర్శకత్వంలో జరుగుతాయని ట్విటర్ అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం మీడియాకు తెలిపారు. ట్విటర్ ఇండియా కీలక ఎగ్జిక్యూటివ్స్ ట్విటర్ ఓవర్సీస్ ఎగ్జిక్యూటివ్స్‌కు రిపోర్ట్ చేస్తారని చెప్పారు.

కాగా, కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పాటించే విషయంలో భారత ప్రభుత్వంతో ట్విటర్ ఢీకొన్న విషయం తెలిసిందే. గ్రీవెన్స్‌ అధికారిగా స్థానికుడినే నియమించాలనే నిబంధన అమలు చేసేందుకు మొదట్లో మీన మేషాలు లెక్కించిన ట్విట్టర్…ఐటీ రూల్స్ పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తామని భారత ప్రభుత్వం తేల్చి చెప్పడంతో చివరకు కొద్ది వారాల క్రితం భారతీయుడినే గ్రీవెన్స్‌ అధికారిగా నియమించింది ట్విట్టర్.

ఇక,గతంలో అధికార పక్ష నేతల ఖాతాలపై చర్యలతో వివాదాస్పదమైన ట్విట్టర్​.. తాజాగా విపక్ష నేతల అకౌంట్లు బ్లాక్​ చేయడం రాజకీయంగా దుమారం పేరుతోంది. తాజాగా రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్​ అధికారిక ఖాతా మరియు పలువురు కీలక నేతల అకౌంట్లను ట్విట్టర్​ బ్లాక్​ చేసిన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఒత్తిడి మేరకే ట్విట్టర్​ ఇలా చేస్తోందని ఆరోపిస్తోంది కాంగ్రెస్. అయితే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతల ఖాతాలతో పాటు కాంగ్రెస్ అధికారిక అకౌంట్​ను బ్లాక్ చేయడాన్ని సమర్థించుకుంది ట్విట్టర్. నిబంధనలకు విరుద్ధంగా ఓ ఫొటోను పోస్ట్ చేసినందుకు ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకే ఇలా చేసినట్లు వివరించింది. సంస్థ రూల్స్​ను పక్షపాతం లేకుండా అమలు చేస్తున్నట్లు తేల్చి చెప్పింది .ట్విట్టర్​తో వివాదంలో ఇతర విపక్షాలు కాంగ్రెస్​కు మద్దతు ప్రకటిస్తున్నాయి. అకౌంట్లు బ్లాక్ చేయడాన్ని టీఎంసీ ఖండించింది.

READ Rahul Gandhi : ట్విట్టర్‌ తీరుపై రాహుల్ గాంధీ ఫైర్

READ Twitter Case : యూపీ పోలీసులపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం..ట్విట్టర్‌ ఇండియా ఎండీకి ఊరట

READ Rahul Gandhi : మరో షాక్.. రాహుల్ ఇన్​స్టాగ్రామ్ ఖాతా కూడా బ్లాక్!