Twitter : వెంకయ్య నాయుడి ట్విట్టర్ బ్లూ టిక్ తొలగింపు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ నుంచి బ్లూ టిక్ మార్క్ ను తొలగించింది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్యాలయం మాత్రం వెరిఫైడ్ బ్యాడ్జ్ కొనసాగుతోంది.

Twitter : వెంకయ్య నాయుడి ట్విట్టర్ బ్లూ టిక్ తొలగింపు

Twitter

Twitter Blue Badge Venkaiah Naidu : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ నుంచి బ్లూ టిక్ మార్క్ ను తొలగించింది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్యాలయం మాత్రం వెరిఫైడ్ బ్యాడ్జ్ కొనసాగుతోంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధికారిక అకౌంట్ నుంచి చివరిసారిగా గత సంవత్సరం జులై 23వ తేదీన ట్వీట్ వచ్చింది.

ఆయన అకౌంట్ కి 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఉప రాష్ట్రపతి కార్యాలయం అధికారిక అకౌంట్ కు 9,31,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి లాంటి హోదాలో ఉన్న‌వ్య‌క్తి ఐడీ బ్లూ టిక్‌ను తొల‌గించ‌డంపై విమ‌ర్శ‌లు వ్యక్తమౌతున్నాయి. కొన్ని రోజులుగా వెంకయ్య నాయుడి ట్విట్టర్ క్రియాశీలకంగా లేదని..అందుకే..ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వెలువడుతున్నాయి. ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన కొంతమంది నేతల విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించిందని తెలుస్తోంది.

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ యూజర్ అకౌంట్ల వెరిఫికేషన్ మొదలుపెట్టింది. మూడేళ్ల తర్వాత ట్విట్టర్.. ప్రముఖుల అకౌంట్లపై బ్లూ టిక్ చెక్ మార్క్ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తోంది. 2017లోనే ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ వెరిఫికేషన్ ప్రాసెస్ నిలిపివేసింది. బ్లూ టిక్ మార్క్ విధానం ఏకపక్షంగా ఉందని, యూజర్లలో గందరగోళానికి దారితీయడంతో ట్విట్టర్ పై విమర్శలు వెల్లువెత్తాయి.

ట్విట్టర్‌ సంస్థకు, కేంద్ర ప్రభుత్వానికి రెండు, మూడు రోజులుగా ఈ వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది అంటూ.. ఓ టూల్‌కిట్‌నూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దాని ప్రకారం.. దేశానికి చెడ్డపేరు తెచ్చేందుకు కాంగ్రెస్ టూల్ కిట్ రూపొందించిందని బీజేపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. అటువంటి ట్వీట్లకు మ్యానిపులేటెడ్ మీడియా అంటూ ట్విట్టర్ ట్యాగ్‌ను జత చేస్తోంది. ఇదే అసలు గొడవకు కారణం అవుతోంది.

Read More : Corona Update: నెలరోజుల తర్వాత కేసులు తగ్గాయి.. మరణాలు మాత్రం తగ్గట్లేదు