ట్విట్టర్‌ కి “కూ”లో కేంద్రం రిప్లై

ట్విట్టర్‌ కి “కూ”లో కేంద్రం రిప్లై

Twitter ట్విట్టర్‌కు, కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య వివాదం ముదురుతోంది. ఢిల్లీలో రైతు నిరసనల నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న 1178 ట్విట‌ర్ అకౌంట్ల‌ను తొలగించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించినా.. ట్విట‌ర్ మాత్రం 500 వ‌ర‌కు మాత్ర‌మే తొల‌గించింది. మిగ‌తా వాటిని భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ పేరుతో తొల‌గించ‌డం లేద‌ని చెప్పింది.

దీనిపై తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం స్పందించింది. ట్విట‌ర్‌కు భారత్ లో ప్ర‌త్య‌ర్థి అయిన స్వదేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ “కూ (koo)”యాప్ లో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌంట‌ర్ ఇచ్చింది. ప్ర‌భుత్వంతో స‌మావేశం కావాల‌న్న ట్విట‌ర్ ప్ర‌తిపాద‌న‌ను ఐటీ శాఖ సెక్రటరీ ప‌రిశీలిస్తున్నారు… ఇప్ప‌టికే ఆయ‌న ట్విట‌ర్ సీనియ‌ర్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతున్నారు… దీనికి ముందు ట్విట‌ర్ స్పంద‌న అస‌హ‌జంగా ఉంది… ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే దీనిపై స్పందిస్తుంది అని కూలో ప్ర‌భుత్వం రిప్లై ఇచ్చింది. “కూ” అనేది భారత్ లో అభివృద్ది చేయబడిన మైక్రోబ్లాగింగ్ సైట్. పలువురు మంత్రులు,ప్రభుత్వ శాఖలు ఇప్పటికే “కూ” లో అకౌంట్ లు క్రియేట్ చేసింది. 2020 ప్రారంభంలో “కూ”ని మయాంక్ బిద్వత్కా,అప్రమేయ రాధాక్రిష్ణ స్థాపించారు.

కాగా, మంగళవారం 1178 ట్విట‌ర్ అకౌంట్ల‌ను తొలగించాల‌ని కేంద్రం ఆదేశాలపై స్పందించిన ట్విట్టర్.. తమ నిబంధనలు, స్థానిక చట్టాల ప్రకారమే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని పోస్టులను తోలగిస్తామని తెలిపింది. అలాగే స్థానిక చట్టాలకు విరుద్ధంగా ఉండే పోస్టులను సోషల్ మీడియా నుంచి తొలగిస్తామని వెల్లడించింది. పోస్టులపై వస్తున్న ఫిర్యాదుల సమాచారాన్ని అకౌంట్ హోల్డర్స్‏కు తెలియజేస్తామని తెలిపింది. తమ ఉద్యోగుల రక్షణకు తాము ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లుగా పేర్కోంది. అకౌంట్లను తొలగించే విషయంలో ప్రభుత్వంతో ఓ అధికారిక సమావేశాన్ని ట్విట్టర్ కోరింది. ఇక, ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్‏తో కూడా ఈ విషయమై చర్చించారు.