Microsoft లేదంటే Twitter, ఎవరుకొన్నా, TIKTOK మళ్లీ ఇండియాకు రావడం ఖాయం. పెట్టుబడుల సంగతేంటి?

  • Published By: madhu ,Published On : August 10, 2020 / 02:55 PM IST
Microsoft లేదంటే Twitter, ఎవరుకొన్నా, TIKTOK మళ్లీ ఇండియాకు రావడం ఖాయం. పెట్టుబడుల సంగతేంటి?

tiktok

ఇండియాలో బ్యాన్ అయిన TikTok పై Twitter కన్నేసింది. దీనిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. ఇప్పటికే ఈ విషయంలో మైక్రో సాప్ట్ ముందడుగు వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా కొనసాగుతుండగానే..అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బ్లూంబెర్గ్’ ఆసక్తికర కథనం వెలువరించింది.



ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ టిక్ టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌. దీనిని విలీనం చేసుకునేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తోందని కథనంలో వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే..మైక్రోసాప్ట్ ఇప్పటికే రంగంలోకి దిగడం..టిక్ టాక్ ను కొనుగోలు చేయగలిగే సత్తా..ట్విట్టర్ కు ఉందా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.



కానీ..అమెరికా ప్రభుత్వం కొనుగోలు ఇతరత్రా వ్యవహారాలకు 45 రోజుల డెడ్ లైన్ విధించింది. అంతలోపున…ఎవరు కొనుగోలు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మైక్రోసాప్ట్ వంటి ట్రిలియన్ డాలర్ల దిగ్గజాన్ని కాదని, 29 బిలియన్ డాలర్ల విలువైన ట్విట్టర్ ఏ విధంగా టిక్ టాక్ ను టేకోవర్ చేస్తుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.



ఈ డీల్‌ కుదుర్చుకోవాలంటే ట్విట్టర్‌ మరిన్ని నిధులు సేకరించుకోవాల్సి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసే సామర్థ్యం ట్విట్టర్‌కు లేదని కొందరు వెల్లడిస్తున్నారు. ట్విట్టర్‌ షేర్‌హోల్డర్‌ అయిన సిల్వర్‌లేక్‌ పెట్టుబడుల విషయంలో సహాయం చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.