Rahul Gandhi: రాహుల్ నైట్ పార్టీ.. కాంగ్రెస్, బీజేపీ ట్విట్టర్ వార్

వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడ పబ్‌లో గడుపుతున్న వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ తీరుపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Rahul Gandhi: రాహుల్ నైట్ పార్టీ.. కాంగ్రెస్, బీజేపీ ట్విట్టర్ వార్

Rahul Gandhi

rahul gandhi: వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడ పబ్‌లో గడుపుతున్న వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ తీరుపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతలు రాహుల్‌పై విమర్శలు చేస్తుండటంతో, కాంగ్రెస్ కూడా స్పందించింది. ట్విట్టర్‌లో బీజేపీ నేతలకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. దేశం సంక్షోభంలో ఉంటే ప్రధాని మోదీ విదేశీ పర్యటన పేరుతో విందుల్లో మునిగి తేలుతున్నారని కాంగ్రెస్ విమర్శించింది.

Rahul Gandhi: నేపాల్ పబ్‌లో రాహుల్ గాంధీ ఖుషీ ఖుషీ: దుమ్మెత్తిపోస్తున్న బీజేపీ నేతలు

కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాకూర్ వంటి నేతలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. అటు రాహుల్‌పై బీజేపీ విమర్శలు, ఇటు ప్రధానిపై కాంగ్రెస్ విమర్శలకు ట్విట్టర్ వేదికగా మారింది. రాహుల్ గాంధీ, ప్రధాని మోదీలాగా ఆహ్వానం లేకుండానే పాక్ వెళ్లి, నవాజ్ షరీఫ్‌తో కేక్ కట్ చేయలేదని కాంగ్రెస్ విమర్శించింది. ‘‘మీరు (బీజేపీ నేతలు) మీ దగ్గరి బంధువులు, స్నేహితుల వివాహ వేడుకకు వెళ్లొచ్చు. కానీ, ఎదుటివాళ్లు వెళ్తే తప్పా. ఈ రోజు ఉదయం వరకు వివాహ వేడుకకు హాజరు కావొచ్చు. అది దేశం చట్టం. కానీ, రేపు ఉదయం నుంచి ఎవరూ పెళ్లికి లేదా పార్టీకి వెళ్లడం నేరం కావొచ్చు. ఎందుకంటే అది ఆర్ఎస్ఎస్ వారికి నచ్చకపోవచ్చు’’ అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

Rahul Gandhi : ఓయూలో రాహుల్ సభకు నో పర్మిషన్

‘‘దేశ పార్లమెంట్ ఎదుట రైతులు ఆత్మహత్య చేసుకుంటే బీజేపీ నేతలు ఏమీ మాట్లాడరు. నిరుద్యోగిత రేటులో హర్యాణా ముందుంది. జీఎస్టీ ద్వారా ప్రభుత్వం సంపాదించడంలో రికార్డు సృష్టించింది. కానీ, ప్రజలకు ఉపాధి చూపించడం మాత్రం మానేశారు. 16 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ హామీ ఏమైంది?’’ అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఆహ్వానం మేరకే రాహుల్ వివాహ వేడుకకు హాజరయ్యారని, పెళ్లికి హాజరవడం నేరమా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. ‘‘రాహుల్ గురించి సంఘీలు ఎందుకు భయపడుతున్నారు? సంఘీలు అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు?’’ అంటూ కాంగ్రెస్ నేత మాణికం ఠాకూర్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.