కరోనా కేర్‌ సెంటర్‌ నుంచి ఖైదీలు పరారీ : సినిమాటిక్ ఎస్కేప్

  • Published By: nagamani ,Published On : June 8, 2020 / 09:52 AM IST
కరోనా కేర్‌ సెంటర్‌ నుంచి ఖైదీలు పరారీ : సినిమాటిక్ ఎస్కేప్

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్న వేళ ఔరంగాబాద్‌ జిల్లాలోని ఓ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నుంచి ఇద్దరు ఖైదీలు  పరారయ్యారు. వీరిద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. చికిత్స నిమిత్తం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించామని అక్కడ నుంచి కిటికీ గ్రిల్స్ తొలగించి బెడ్స్ షీట్స్ లను తాడులాగా ఉపయోగించి కిందకు దిగి పారిపోయారని జైలు అధికారి తెలిపారు. దీంతో జైలు అధికారిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. 

ఈ ఘటనపై బేగంపుర పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పారిపోయిన ఖైదీల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. మహారాష్ట్రలో కరోనా కేసులు దేశంలోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హరుల్స్ జైలులో 29మంది ఖైదీలకు అధికారులు కరోనా పరీక్షలు చేయించారు. 

దీంతో ఔరంగాబాద్ వాసులైన సయ్యద్ సైఫ్, అక్రంఖాన్ అనే ఇద్దరు ఖైదీలకు కరోనా పాజిటివ్ రావటంతో వీరిద్దరినీ జౌరంగాబాద్ లోని కిలియార్క్ ప్రాంతంలోని కోవిడ్ కేర్ సెంటర్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు ఆదివారం రాత్రి 10.45గంటలకు పరారయ్యారు.  

పరారైన వీరిద్దరిలో ఒకరు ఫోర్జరీ సంతకాల కేసులోనూ..మరొకరు ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిద్దరూ కోవిడ్ సెంటర్ లో చికిత్స పొందుతున్న క్రమంలో వీరికి రెండు షిఫ్టుల్లో ఇద్దరు అధికారులతో సహా మొత్తం 14మంది జైలు సిబ్బంది కాపలాగా ఉన్నారు. ఖైదీలుండే రూమ్ లను బైట నుంచి తాళం వేసి అత్యంత జాగ్రత్తగా కాపలా కాస్తున్నా వారు అంత్యం చాకచక్యంగా తప్పించుకున్నారని పోలీసు అధికారి తెలిపారు. 

వారు తప్పించుకున్నారనే విషయం గుర్తించిన వెంటనే భద్రతా సిబ్బంది వారిని వెం బడించినా చీకటిగా ఉండటంతో వారిని పట్టుకోలేకపోయామని తెలిపారు..పరారైనవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని త్వరలోనే వారి పట్టుకుంటామని తెలిపారు.

Read: ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి మాస్క్‌లు తయారీ..