CPM Kerala : మ‌హిళా స‌భ్యురాలి న‌గ్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సీపీఎం నేతలు

ఓ మహిళకు మత్తుమందు కలిపినా జ్యూస్ ఇచ్చి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి.. నగ్న వీడియోలు తీసి సర్క్యులేట్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

CPM Kerala : మ‌హిళా స‌భ్యురాలి న‌గ్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సీపీఎం నేతలు

Cpm Kerala

CPM Kerala : కేరళలో ఇద్దరు అధికార పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ కార్యకర్త నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సీపీఎం నేత సాజిమోన్, సీపీఎం అనుబంధ సంస్థ డివైఎఫ్‌ఐ కార్యకర్త నాసర్‌ లను తిరువల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు మరో 12 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

చదవండి : Kerala Mother : అమ్మ ప్రేమ గెలిచింది..ఆ బిడ్డ అనుపమ బిడ్డే

వివరాల్లోకి వెళితే .. సీపీఎం మహిళ కార్యకర్తను కారులో ఎక్కించుకున్న సాజిమెన్ మార్గమధ్యంలో మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరవాత లైంగిక దాడి చేసి ఆమె నగ్నచిత్రాలను తన ఫోన్‌లో బంధించారు. అనంతరం ఆ ఫోటోలను నాజర్‌కు షేర్ చేశాడు. కొద్దీ రోజుల తర్వాత సదరు మహిళకు ఫోన్ చేసి తమ వద్ద నగ్న ఫోటోలు ఉన్నాయని.. రెండు లక్షలు ఇస్తే వాటిని డిలీట్ చేస్తామని లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదించారు. సమయానికి డబ్బులేకపోవడంతో వారు అడిగినంత ఇవ్వలేకపోయింది సదరు మహిళ కార్యకర్త. వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించింది.

చదవండి :  Kerala Tea Stall Owner : భార్యతో ప్రపంచయాత్ర చేసే టీ స్టాల్ ఓనర్ కన్నుమూత

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సాజిమెన్‌తోపాటు డివైఎఫ్‌ఐ కార్యకర్త నాసర్‌‌ను అదుపులోకి తీసుకోని విచారించారు. విచారణలో మరో 10 మందికి వీడియో షేర్ చేసినట్లు తెలపడంతో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

చదవండి : Kerala : బలవంతపెట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే అత్యాచారమే..కేరళ హైకోర్టు కీలక తీర్పు

సాజిమెన్‌పై గతంలో కూడా లైంగిక వేధింపుల కేసు నమోదైంది.. వివాహితపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన కేసులో సాజిమెన్‌ను దోషిగా తేల్చింది కోర్టు. ఇదే సమయంలో తన పలుకుబడిని ఉపయోగించి డీఎన్ఏ రీపోర్టును మన్యుపులేట్ చేయడానికి ప్రయత్నించాడు. అధికారం చేతిలో ఉండటంతో కొందరు అధికారులను బెదిరించాడు. ఈ వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో అతడిని స్థానిక కమిటీ సభ్యుడి హోదా నుంచి తప్పించి కొట్టాలి శాఖ కార్యదర్శిగా చేసింది. అయినా సాజిమెన్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు.