కరోనా పాజిటివ్ వచ్చింది.. అయినా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు

వైద్య వృత్తి కేవలం ఉపాధి మాత్రమే కాదు, ఏ సంక్షోభంలోనైనా అనుసరించాల్సిన మతం. కరోనా సంక్షోభంలో ఒకరినొకరు దగ్గరికి వెళ్ళడానికి ప్రజలు భయపడుతుండగా, భోపాల్ లో ఇద్దరు వైద్యులు తమకు కరోనా సోకినప్పటికీ రోగులకు చికిత్స చేస్తున్నారు.

కరోనా పాజిటివ్ వచ్చింది.. అయినా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు

Bhopal

two doctors both positive treating patients : వైద్య వృత్తి కేవలం ఉపాధి మాత్రమే కాదు, ఏ సంక్షోభంలోనైనా అనుసరించాల్సిన మతం. కరోనా సంక్షోభంలో ఒకరినొకరు దగ్గరికి వెళ్ళడానికి ప్రజలు భయపడుతుండగా, భోపాల్ లో ఇద్దరు వైద్యులు తమకు కరోనా సోకినప్పటికీ రోగులకు చికిత్స చేస్తున్నారు. తద్వారా ఇతరులకు దైర్యం నూరిపోస్తున్నారు.

డాక్టర్ అనురాధ చౌదరి భోపాల్ లోని గాంధీ మెడికల్ కాలేజీ (జిఎంసి)లో శస్త్రచికిత్స విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్.. ఆమె 10 రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అయినా ఈ ప్రాణాంతక వ్యాధిని లెక్కచేయకుండా సాటిరోగుల ప్రాణాలు నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఆమె హమిడియా హాస్పిటల్ ఎ బ్లాక్ రెండవ అంతస్తులో ఉన్న 20 మందికి పైగా రోగులకు చికిత్స చేస్తున్నారు. డాక్టర్ దేవేంద్ర మరియు డాక్టర్ బర్డే తనను ప్రోత్సహించారని ఆమె చెప్పారు. వైద్యులు అనారోగ్యంతో ఉన్నా నమ్మి వచ్చిన రోగులకు సహాయం చేయడం మరచిపోకూడదన్న సూత్రాన్ని తాను అవలంబిస్తున్నానని అన్నారు. తన ప్రాణంతోపాటు అందరి ప్రాణాలు తనకు ముఖ్యమని అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె అన్నారు.

డాక్టర్ అనుభవ్ అగర్వాల్ జిఎంసిలో మూడవ సంవత్సరం ఎండి మెడిసిన్ చదువుతున్నారు.. ఆయనకు కూడా ఏప్రిల్ 16 న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హమీడియాలోని ఓ బ్లాక్‌లోని మొదటి అంతస్తులో రెస్ట్ తీసుకుంటూనే.. ఇక్కడ రోగులకు చికిత్స అందిస్తున్నారు. రోగుల ఆరోగ్యం నా బాధ్యతగా అర్థం చేసుకున్నాను.. కాబట్టి చికిత్సలో పాలుపంచుకున్నాను.. నేను అనారోగ్యంగా ఉన్నా నా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకూ రోగులకు చికిత్స చేయడానికి ప్రయత్నిస్తాను అంటారు అనుభవ్ అగర్వాల్.. ఇక డాక్టర్ అనురాధ చౌదరి, అనుభవ్ అగర్వాల్ ల పనితీరు చూసిన సీనియర్ వైద్యులు వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.