COVID-19 Vaccines: రెండు వేర్వేరు వ్యాక్సిన్‌లు తీసుకోవడం ప్రమాదకరం కాదు

ఏ వ్యక్తైనా రెండు పర్యాయాలు వేర్వేరు టీకాలు తీసుకుంటే అది ఆందోళన కలిగించే విషయం కాదని, నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ వివరించారు.

COVID-19 Vaccines: రెండు వేర్వేరు వ్యాక్సిన్‌లు తీసుకోవడం ప్రమాదకరం కాదు

Covid 19 Vaccines

COVID-19 Vaccines: ఏ వ్యక్తైనా రెండు పర్యాయాలు వేర్వేరు టీకాలు తీసుకుంటే అది ఆందోళన కలిగించే విషయం కాదని, నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ వివరించారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి ప్రజలలో కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులపై డాక్టర్ వికె పాల్ స్పందించారు. డాక్టర్ వికె పాల్ మాట్లాడుతూ, ఒక వ్యక్తికి రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేర్వేరు వ్యాక్సిన్‌లు వేయించుకుని ఉంటే.. అది సురక్షితమే.. భయపడాల్సిన అవసరం లేదు అని అన్నారు.

డాక్టర్ వి.కె. పాల్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం, టీకా తీసుకునే వ్యక్తులు ఒకే వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకోవాలి. అయితే, ఉత్తర ప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌లో 20 మందికి రెండు రకాల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. తమ ప్రోటోకాల్‌ ప్రకారం రెండు డోసులు ఒకే కంపెనీకి చెందినవి ఇవ్వాలి.

అయితే తొలి డోసు ఇచ్చిన వ్యాక్సిన్‌ కాకుండా మరో వ్యాక్సిన్‌ ఇచ్చినా నష్టమేం లేదు. ఒక వ్యాక్సిన్‌కు బదులు మరో వ్యాక్సిన్ వేసుకుంటే ఇమ్యునిటీ మరింత పెరుగుతుందని అన్నారు. ఇది సైంటిఫిక్‌గా రుజువు కావలసి ఉందన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌ జిల్లా బద్ని పీహెచ్‌సీలో 20 మందికి ఏప్రిల్ 1న కోవిషీల్డ్‌ ఇవ్వగా.. మే 14న రెండో డోస్‌ కోవాగ్జిన్‌ ఇచ్చారు. దీంతో 20 మంది అయోమయంలో పడ్డారు. తప్పు తెలుసుకున్న అధికారులు 20 మందిని వైద్య పరిశీలనలో ఉంచారు. అయితే ఇప్పటివరకు వీరిలో ఎవరికి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు.