COVID-19: వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే 98శాతం కోలుకోవచ్చు

కరోనా నుంచి కాపాడుకునే ఏకైక మార్గం కరోనా మాత్రమే. ఎంత త్వరగా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే అంత సేఫ్ అని, నిపుణులు చెబుతున్నారు.

COVID-19: వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే 98శాతం కోలుకోవచ్చు

Vaccination

Both doses of vaccine give around 98 per cent protection from death: కరోనా నుంచి కాపాడుకునే ఏకైక మార్గం కరోనా మాత్రమే. ఎంత త్వరగా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే అంత సేఫ్ అని, నిపుణులు చెబుతున్నారు. COVID-19 వ్యాక్సిన్ రెండు మోతాదులు వేసుకున్న తర్వాత కరోనా వచ్చినా కూడా మరణించే అవకాశం 98శాతం లేదని స్పష్టం చేసింది ఓ అధ్యయనం. పంజాబ్ పోలీసులపై ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో ఈమేరకు విషయం వెల్లడైంది. ఒక మోతాదు వేసుకున్న తర్వాత దాదాపు 92శాతం సేఫ్ అని ఈ అధ్యయనం చెబుతుంది.

పంజాబ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌తో కలిసి పంజాబ్ ప్రభుత్వం వ్యాక్సిన్ పనితీరుపై అధ్యయనం చేయగా.. స్టడీలో వచ్చిన వివరాలను నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వీకే పాల్ మీడియాకు వెల్లడించారు. అధ్యయనం వివరాలను వెల్లడించిన ఎన్ఐటిఐ ఆయోగ్ సభ్యుడు(హెల్త్) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. 4,868మంది పోలీసు సిబ్బందికి వ్యాక్సిన్‌లు వేయలేదని, వారిలో 15మంది కరోనావైరస్‌తో మరణించారని, డెత్ రేటు 3.08గా ఉందని చెప్పారు.

ఒక్క డోసు తీసుకున్న 35,856 మంది పోలీసు సిబ్బందిలో, తొమ్మిది మంది చనిపోయారని, అంటే వెయ్యి మందిలో డెత్ రేట్ 0.25గా ఉందని, 42,720మంది రెండు డోసులను తీసుకోగా.. టీకా రెండు మోతాదులను పొందినవారిలో ఇద్దరు మాత్రమే చనిపోయినట్లు వెల్లడించారు. అంటే వెయ్యికి డెత్ రేటు 0.05గా ఉందని పత్రికా సమావేశంలో స్పష్టంచేశారు.

“పోలీసు సిబ్బంది కోవిడ్ డేంజరస్ జోన్‌లో ఉండేవారు. అయితే, ఒక్కడోసు వేయించుకున్నా కూడా కరోనా వల్ల చావు రాకుండా తప్పించుకునే చాన్స్ 92 శాతంగా ఉంది” అని డాక్టర్ వీకే పాల్ చెప్పారు. టీకాలు ప్రభావవంతంగా ఉన్నాయని, వాటిపై నమ్మకం ఉంచి ప్రతీఒక్కరూ వ్యాక్సిన్‌లు వేయించుకోవాలని అన్నారు.