రోడ్డుమీదే కాదు నదిలోనూ యాక్సిడెంట్ : రెండు బోట్లు ఢీ 

  • Edited By: veegamteam , September 11, 2019 / 06:57 AM IST
రోడ్డుమీదే కాదు నదిలోనూ యాక్సిడెంట్ : రెండు బోట్లు ఢీ 

ప్రమాదాలు రోడ్లమీదే కాదు నీటిలో కూడా జరుగుతాయి. గాల్లో కూడా జరుగుతాయి. ఇంతకీ నీటిలో యాక్సిడెంట్ ఏంటీ అనుకుంటున్నారా. కర్నాటకలోని నదిలో రెండు బోట్లు ఢీకొన్నాయి. సాగ‌ర తాలుక‌లో ఉన్న శ‌రావ‌తి న‌దిలో ఈ ప్రమాదం జరిగింది.  అంబరగోడ్లు జలమార్గం కలసవల్లిలో జలమార్గంలో శరావతి న‌దిలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు ఫెర్రీల్లోనూ 200 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో ఎటువంటి హానీ జరగలేదు.కానీ రెండు బోట్ల‌కూ కొద్దిగా న‌ష్టం జ‌రిగింది. మాదానికి గురైన ఈ ఫెర్రీల్లో బైకులు,కార్లు, ప్రయాణీకులతో పాటు పలు పెద్ద వాహనాలను కూడా ఉన్నాయి.