నాకు పిల్లను వెతికి పెట్టండి సార్, పోలీసులకు రిక్వెస్ట్..

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. తనకు పిల్లను వెతికి పెట్టమంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.

నాకు పిల్లను వెతికి పెట్టండి సార్, పోలీసులకు రిక్వెస్ట్..

Marrige

find him a bride : ఉత్తర్‌ ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. తనకు పిల్లను వెతికి పెట్టమంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. నేరాలు, ఘోరాలతో బిజీగా ఉండే పోలీసులు ఈ రిక్వెస్ట్‌తో బిత్తరపోయారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలోని ఖైరానా గ్రామానికి చెందిన అజీమ్‌కి 26 ఏళ్ల వయస్సు వచ్చినా..ఇంకా పెళ్లి కాలేదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూస్తున్నా.. ఒక్కటి కూడా నిఖా వరకు పోవట్లేదు. దీంతో తిక్కరేగిన అజీమ్‌ తనకు పెళ్లి సంబంధాలూ చూడమంటూ కొత్వాలి పోలీసులను ఆశ్రయించాడు.

అజీమ్‌కి చిన్న వయసులో శారీరక ఎదుగుదల నిలిచిపోయంది. 26 ఏళ్లు వచ్చినా కేవలం రెండు అడుగుల ఎత్తుతో మరుగుజ్జుగా ఉండిపోయాడు. ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా… అతన్ని చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రావడం లేదు. తనకు పెళ్లి సంబంధాలు చూడటంతో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భావించిన అజీమ్‌ ఏకంగా పోలీసులనే ఆశ్రయించాడు. తనకు ఎలాగైనా ఓ మంచి సంబంధం చూసి పెట్టాలని రిక్వెస్ట్‌ చేశాడు. అయితే తాము పెళ్లిళ్లు చేయమని, భార్యభర్తల మధ్య గొడవలు వస్తే పరిష్కారిస్తామని అతనికి సర్ది చెప్పారు పోలీసులు.

అప్పటికీ అజీమ్‌ మెత్తబడకపోతే.. తమకు ఎవరైనా తెలిసిన వాళ్లుంటే చెబుతామన్నారు. గతంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ , మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌లకు కూడా తనకు పెళ్లి పిల్లను చూడమని కోరుతూ ఉత్తరాలు రాశాడట అజీమ్‌. మావాడి బాగోగులు చూసుకునే అమ్మాయి కోసం ఎంతో కాలంగా వెతుకుతున్నామని, మొరాదాబాద్‌లో ఓ సంబంధం ఉందని త్వరలో అక్కడి వెళ్తామని.. చెప్పాడు అజీమ్‌ సోదరుడు నయీమ్‌.