Two Friends At Kartarpur : దేశ విభజనప్పుడు దూరమై..74 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు

1947లో దేశ విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు 74 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తిరిగి కలుసుకున్నారు. 20 ఏళ్ల వయస్సులో అనూహ్యమైన

Two Friends At Kartarpur : దేశ విభజనప్పుడు దూరమై..74 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు

Friends

Two Friends At Kartarpur :  1947లో దేశ విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు 74 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తిరిగి కలుసుకున్నారు. 20 ఏళ్ల వయస్సులో అనూహ్యమైన పరిణామాల వల్ల దూరమైన ఈ ఇద్దరు స్నేహితులు..90 ఏళ్ల వయస్సుల్లో మళ్లీ కలుసుకొని తమ బాల్య స్మృతులను నెమరేసుకున్నారు. జీవితంలో మళ్లీ కలుసుకుంటామని అనుకోని వారు.. ఆత్మీయంగా పలకరించుకుని మురిసిపోయారు.

ఆ ఇద్దరు స్నేహితుల కథేంటీ
ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న నరోవాల్ సిటీకి చెందిన మొహమ్మద్ బషీర్(91),భారత్ లోని పంజాబ్ కు చెందిన సర్దార్ గోపాల్ సింగ్(94)…1947లో దేశ విభజనకు ముందు,పాకిస్తాన్ ఏర్పాటవ్వక ముందు తరుచుగా బాబా గురునానక్ గురుద్వారాని సందర్శించేవాళ్లు. ఆ క్రమంలో వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. గురుద్వారా దగ్గరే కలిసి భోజనం చేసేవాళ్లు,టీ తాగేవాళ్లు.

ఇలా హాయిగా వారి స్నేహం సాగుతున్న సమయంలో 1947లో దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పాటైంది. 1947 దేశ విభజన సమయంలో తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గోపాల్ సింగ్- బషీర్‌లు దూరమయ్యారు. అయితే తర్వాత కలుసుకోవాలని భావించినప్పటికీ సాధ్యపడలేదు.

అయితే కరోనా కారణంగా మూతబడిన కర్తార్​పుర్​ కారిడార్ ఇటీవలే తెరచుకుంది. ఈ నేపథ్యంలో కర్తార్​పుర్​కు పర్యటకులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కర్తార్‌పుర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ సందర్శనలో అనుకోకుండా గోపాల్ సింగ్- బషీర్‌లు తారసపడ్డారు. దీనితో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాత రోజులను గుర్తు చేసుకుంటూ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు. తమ చిన్ననాటి రోజులను నెమరు వేసుకున్నారు. కర్తార్‌పుర్ నడవా నిర్మాణం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. భారత్-పాక్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్ల తర్వాత కలుసుకున్న ఈ  స్నేహితుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. వీరిది అపూర్వమైన కలయిక అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

కాగా,పంజాబ్ గురాదస్​పుర్ జిల్లాలోని డేరాబాబా ననక్​, పాకిస్తాన్​లోని​ గురుద్వారా దర్బార్​ సాహిబ్​ను కలిపేదే కర్తార్​పుర్ కారిడార్. 4.7కిలోమీటర్లున్న ఈ కారిడార్​ ద్వారా సిక్కులు పాకిస్తాన్ లో ఉన్న తమ గురుదైవమైన గురునానక్​ దేవ్​ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

1522 సంవత్సరంలో గురునానక్‌ దేవ్‌ కర్తార్‌పుర్‌ వద్ద సాహిబ్‌ గురుద్వారాను నెలకొల్పారు. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పూజ్యనీయ స్థలాన్ని వీసా లేకుండా దర్శించుకోవడానికి సిక్కు మతస్థులు దశాబ్దాలుగా ఎదురుచూశారు. చివరికి వారి ఎదురుచూపులు ఫలించి.. కారిడార్‌ నిర్మాణానికి ఇరు దేశాలు అంగీకరించి 2019లో పూర్తిచేశాయి. కరోనా రెండో దశ విజృంభణ కారణంగా కర్తార్‌పుర్ కారిడార్​ను 2020 మార్చిలో మూసేశారు. సిక్కు మత స్థాపకులు శ్రీ గురునానక్​ జయంతిని పురస్కరించుకొని.. దాదాపు ఏడాదిన్నర తర్వాత గత వారం ఈ కారిడార్​ను​ తెరిచారు.

ALSO READ ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ, రూ. 1000 కోట్లివ్వాలని వినతి