Trains Collide: ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టకున్న రెండు గూడ్స్ రైళ్లు.. ప్రాణనష్టం లేదని ప్రకటించిన రైల్వే
వేగంగా వస్తూ ఢీకొనడం వల్ల రెండు రైళ్ల వ్యాగన్లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు కొంత మేరకు డ్యామేజీ అయ్యాయి. ఆ సైట్‌లో క్లియరెన్స్ పనులు కొనసాగున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనతో లక్నో-వారణాసి మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు రద్దు కాగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.

two goods trains collide in UP's Sultanpur
Trains Collide: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో గురువారం ఉదయం రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రయాగ్‌రాజ్ రైల్వే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఒకే ట్రాక్‌పై రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒక గూడ్స్ రైలు పైలట్‌కు గాయాలయ్యాయి. వేగంగా వస్తూ ఢీకొనడం వల్ల రెండు రైళ్ల వ్యాగన్లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు కొంత మేరకు డ్యామేజీ అయ్యాయి. ఆ సైట్‌లో క్లియరెన్స్ పనులు కొనసాగున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనతో లక్నో-వారణాసి మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు రద్దు కాగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.
Uttar Pradesh | Collision between two goods trains leads to the derailment of wagons in Sultanpur; no casualties reported pic.twitter.com/z6UF9YWP8g
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 16, 2023
Shocking News : వాషింగ్ మెషిన్‌లో పడ్డ బుడ్డోడు..పావుగంట తరువాత ప్రాణాలతో బయటపడ్డ ఏడాది పిల్లాడు