Shopian Encouter : ఎన్ కౌంటర్ లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. షోపియాన్‌ జిల్లాల్లో ఇవాళ ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో భద్రతా దళాలు

Shopian Encouter : ఎన్ కౌంటర్ లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు హతం

Ka (1)

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. షోపియాన్‌ జిల్లాల్లో ఇవాళ ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో భద్రతా దళాలు.. ఇద్దరు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఎదురు కాల్పుల సందర్భంగా ముగ్గురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. గాయడిన జవాన్లను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు తరలించారు.

షోపియాన్‌లోని ద్రాగడ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో కశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. భద్రతా సిబ్బందిని చూడగానే ముష్కరులు కాల్పులు చేశారని పోలీసులు తెలిపారు. దీంతో ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

మృతి చెందినవారిలో ఒకరు ఆదిల్‌ అహ్‌ వానీగా గుర్తిచామన్నారు. అతడు గతేడాది జూలై నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. పుల్వామాలో వలస కూలీల హత్యకేసులో అతడు ప్రధాన నిందితుడని తెలిపారు. లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన షోపియాన్ జిల్లా కమాండర్ గా వ్యవ ఆదిల్‌ అహ్‌ వానీ వ్యవహిరించవాడని చెప్పారు. హతుడైన మరో ఉగ్రవాదికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని చెప్పారు. అయితే, గడిచన 2 వారాల్లో 15 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు జమ్మూకశ్మీర్ ఐజీపీ తెలిపారు.

ALSO READ Chandrababu: ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ!