Australia Mans : గుక్కెడు నీళ్లు కూడా లేకుండా ఐదు రోజులు..ప్రాణాలమీదకు తెచ్చిన విహార యాత్ర

విహార యాత్రకని బయలుదేరిన ఇద్దరు వ్యక్తులు పొరపాటున తప్పిపోయారు. గుక్కెడు నీళ్లు కూడా లేకుండా ఐదు రోజులు బతికి ఐదు రోజుల తరువాత ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డారు.

Australia Mans : గుక్కెడు నీళ్లు కూడా లేకుండా ఐదు రోజులు..ప్రాణాలమీదకు తెచ్చిన విహార యాత్ర

Australia Mans With Out Water

Australia Mans : తినటానికి గుప్పెడు ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బ‌తికేయొచ్చు. కానీ తాగటానికి మంచినీళ్లు లేకపోతే కష్టమే. అటువంటిది ఇద్దరు వ్యక్తులు దారి తప్పి కనీసం తాగటానికి గుక్కెడు నీరు కూడా లేకుండా బతికారు. చావు తృటిలో తప్పి ప్రాణాలతో బయటపడిన ఘటన ఆస్ట్రేలియాలో ఇద్దరు వ్యక్తులకు జరిగింది. ప‌చ్చి మంచినీళ్లు కూడా లేకుండా ఏకంగా ఐదు రోజులు బ‌తికారువారిద్దరు. గత మంగ‌ళ‌వారం (అక్టోబర్ 12,2021) త‌ప్పిపోయిన ఆ ఇద్ద‌రూ పోలీసులు హెలిక్యాప్ట‌ర్ సాయంతో తీవ్రంగా గాలించ‌గా ఐదు రోజుల త‌ర్వాత డీహైడ్రేష‌న్‌కు గురైన స్థితిలో దొరికారు.

Read more : Mens wearing sarees : ప్రాయశ్చిత్తం కోసం..200 ఏళ్లుగా చీరలు కట్టుకుంటున్న మగవాళ్లు

హెర్మాన్స్‌బ‌ర్గ్ అనే మారుమూల ప్రాంతానికి చెందిన షాన్ ఎమిట్జా అనే 21 ఏళ్ల యువకుడు మ‌హేశ్ పాట్రిక్ అనే ఓ బాలుడితో కలిసి గ‌త మంగ‌ళ‌వారం సెంట్ర‌ల్ ఆస్ట్రేలియాలోని హార్ట్స్ రేంజ్ ఏరియా నుంచి త‌ప్పిపోయారు. వీరిద్దరు విహారయాత్ర‌కని బయలుదేరి వెళ్లారు. వెళ్లటం బాగానే వెళ్లారు. కానీ తిరుగు ప్ర‌యాణంలో దారిత‌ప్పిపోయారు. ఎలా రావాలో అర్థం కాలేదు. అలా ఇద్దరు చెరోదారి అయిపోయారు. అలా ఇద్దరు కూడా తినటానికి తిండి కాదు కదా..కనీసం తాగటానికి గుక్కెడు నీళ్లు కూడా లేకుండా అయిపోయారు.

చెత్తాచెదారం, మురికి కంపుతో కూడిన ప్రాంతంలో ఇరుక్కుపోయారు. ప‌చ్చి మంచినీళ్లు కూడా దొర‌క‌ని ఏరియాలో చిక్కుకుని అల్లాడిపోయారు. విష‌యం తెలుసుకున్న స్థానిక పోలీసులు హెలిక్యాప్ట‌ర్ తో వారి కోసం గాలించారు. అలా వారిని ఎట్టకేలకు గుర్తించారు. పోలీసులు వారిని గుర్తించే సమయానికి గొంత అంతా పిడచకట్టుకుపోయి..డీహైడ్రేష‌న్‌కు గురైన స్థితిలో కనిపించారు.వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించిన పోలీసులు చికిత్సనందించారు. దీంతో వారు కోలుకుంటున్నారు.

Read more: water hyacinth sarees : గుర్రపు డెక్క పూల చీరల తయారీ..యువ ఇంజనీర్ ఐడియా..

దారి కోసం వెతుకుతూ ఇద్ద‌రూ విడివిడిగా వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయార‌ని పోలీసులు తెలిపారు. మ‌హేశ్ ప్యాట్రిక్‌ను శుక్ర‌వారం (15,2021) సాయంత్రం బుష్‌లాండ్ ఏరియాలోను..శ‌నివారం అక్క‌డికి స‌మీపంలోని మ‌రో ప్రాంతంలో షాన్ ఎమిట్జా ఆచూకీ క‌నిపెట్టారు. ఇద్ద‌రూ తీవ్ర డీహైడ్రేష‌న్‌కు గురైన స్థితిలో వాళ్లు దొర‌క‌డంతో ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రికీ ప్రాణాపాయం త‌ప్పింది. దీంతో వారి విహార యాత్ర కాస్తా ప్రాణాలమీదకు తెచ్చినట్లైంది.